మహేష్ కోసం రాజమౌళి గ్లోబల్ ప్లాన్.. వారణాసి కోసం అలా చేయబోతున్నాడా..!

టాలీవుడ్ స‌త్తా వ‌ర‌ల్డ్ వైడ్‌గా చాటి చెప్పిన దర్శకుడు అన‌గానే టక్కున దర్శకధీరుడు రాజమౌళి పేరే వినిపిస్తుంది. ఇక ప్రస్తుతం రాజమౌళి.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్‌వరల్డ్ ప్రాజెక్ట్ వారణాసి రూపొందిస్తున్నాడు. ఈ మూవీతో ప్రపంచ మార్కెట్ టార్గెట్ చేశాడు జక్కన్న. ఇప్పటికే గ్లోబల్ లెవెల్లో సినిమాపై భారీ అంచనాల‌ను నిలకొల్పాడు. గ్లోబల్ మార్కెట్‌ను లక్ష్యంగా తీసుకొని భారతీయ పురాణాలు.. మరియు ఆధ్యాత్మికతను జోడించి అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాలు రూపొందిస్తున్నాడు. ఇక మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా.. మలయాళ‌ స్టార్ నటుడు పృధ్వీరాజ్ సుకుమారన్ విల‌న్‌ పాత్రలో మెర‌వ‌నున్నారు.

Avatar 3 may feature Varanasi first look-Rajamouli and Cameron's...

ఇక.. ఇప్పటికే భారీ కాస్టింగ్‌తో సందడి చేస్తున్న ఈ సినిమాలో.. మరో ఇంటర్నేషనల్ లెవెల్ నటుడు ఎంట్రీ ఇవ్వబోతున్నాడంటూ టాక్‌ ప్రస్తుతం వైరల్‌గా మారుతుంది. దీనికి తగ్గట్టుగానే.. సినిమాల అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకపోయినా.. భారీ లెవెల్ ప్రమోషన్స్ కోసం రాజమౌళి సిద్ధం చేశాడట. ఇదే వార్త ప్రస్తుతం ఇండియన్, హాలీవుడ్ వర్గాల్లో వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా విదేశీ ఆడియన్స్‌ను ఆకట్టుకునేందుకు.. భారీ స్కేల్లో మహేష్ ను స్క్రీన్‌పై ప్ర‌జెంట్‌ చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు సమాచారం.

SS Rajamouli Meets Hollywood Star Director James Cameron | RRR | Golden  Globe | Tupaki

డైరెక్టర్ జేమ్స్ కామెరున్‌ రూపొందించిన‌.. ఫాంట‌సీ బ్లాక్ బస్టర్ ఫాంటసీ మూవీ అవతార్ 3.. ఫెయిర్ అండ్ యాష్‌.. డిసెంబర్ 19న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇక్కడ మ‌రో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. అవతార్ 3 స్క్రీనింగ్ టైంలో వారణాసి టీజర్ థియేటర్లలో రిలీజ్ చేసేలా ఓ స్పెషల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు సినీ వర్గాల సమాచారం. కేవలం ఒక భారతదేశమే కాదు.. ఇతర దేశాలలో ముఖ్యమైనచోట్ల.. ఈ మూవీ ఇంటర్వెల్ టైంలో వారణాసి టీజర్ చూపించరున్నారట. ఈ అరుదైన కాంబినేష‌న్‌ రాజమౌళి వల్లే సాధ్యమైందని.. జేమ్స్‌తో ఆయనకు ఉన్న వ్యక్తిగత సంబంధాలే కారణమంటూ విశ్లేషకులు చెబుతున్నారు.