ప్రస్తుతం ఇండస్ట్రీ బాగా అప్డేట్ అయింది. చిన్నా, పెద్ద అని తేడా లేకుండా.. అన్ని సినిమాలు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ చేస్తున్నారు. ఓటీటీలోను అన్ని భాషల్లో సందడి చేస్తున్నాయి. ఇక హీరోలు, హీరోయిన్లు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్లు ఒక్క భారీ సినిమాలో నటించిన ఒకేసారి నాలుగైదు భాషల్లో పాపులారిటీ దక్కుతుంది. ఇతిలా ఉంటే.. అసలు పాన్ ఇండియా సినిమాలే లేని సమయంలో కూడా.. కొంతమంది ముద్ధుగుమ్మ లు.. ఇతర భాషల్లోనూ సినిమాలు చేసి మెప్పించారు. ఆ లిస్టులో ఇప్పుడు మనం మాట్లాడుకునే హీరోయిన్ కూడా ఒకటి.

దాదాపు 10 భాషల్లో.. 90కి పైగా సినిమాలలో నటించిన ఈ అమ్మడు ఇండస్ట్రీలో తిరుగులేని క్రేజ్‌తో దూసుకుపోయింది. ఆ స్టార్ హీరోయిన్ ఎవరో కాదు.. సీనియర్ ముద్దుగుమ్మ నగ్మా. ఈమెకు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. 90వ దశాబ్దంలో తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయిన నగ్మా.. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, భోజపురి, పంజాబీ, బెంగాలీ ,మరాఠీ ఇలా.. అన్ని భాషల్లో నటించి మెప్పించింది. అదే టైంలో లవ్ ట్రాక్ నడుపుతూ.. ఎఫైర్ వార్తల్లోను వైరల్ గా మారింది.

నటుడు శరత్ కుమార్, మనోజ్ తివారి, రవి కిషన్‌లతో పాటు క్రికెటర్ శౌరవ్ గంగూలీ తోను ఆమె ప్రేమ వ్యవహారాలు వైరల్‌గా మారాయి. అయితే ఒకరితో కూడా ఈ అమ్మడి బంధం నిలబడలేదు. ఇప్పటికే సోలో లైఫ్ లీడ్ చేస్తుంది. ఐదు పదుల వయసులోనూ.. తన అందంతో ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. మరోపక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతుంది. సినిమాలకు దూరంగా ఉంటూనే.. సోషల్ మీడియాలో సందడి చేస్తుంది. ఈమెకు సంబంధించిన రెగ్యులర్ ఫోటోలు అభిమానులతో షేర్ చేసుకుంటుంది.

