భారత సినీ ఖ్యాతి పాన్ఇండియాకు చాటి చెప్పిన డైరెక్టర్ ఎవరు అంటే టక్కున రాజమౌళి పేరు వినిపిస్తుంది. ఆయన పేరు చెబితే చాలు ఆడియన్స్‌లో స్పెషల్ వైబ్ క్రియేట్ అవుతుంది. అంతలా ఇప్పటివరకు తను తెరకెక్కించిన సినిమాలతో పాన్ ఇండియా లెవల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. జక్కన్న ప్రస్తుతం.. సూపర్ స్టార్ మహేష్ బాబుతో వారణాసి సినిమా పనుల్లో బిజీగా గడుపుతున సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈసారి ఏకంగా పాన్ వరల్డ్ మార్కెట్‌ను టార్గెట్ చేశాడు. తర్వాత.. రాజమౌళి ఏంట్రీ ఎవరితో ఉండబోతుంది అనే ప్రశ్నలకు ఇప్పటికే రకరకాల సమాధానాలు వైరల్ అవుతున్నాయి. మహేష్ తర్వాత రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్లానింగ్ మొదలు పెట్టేసాడట.

తాజా సమాచారం ప్రకారం.. ఆ సినిమా సాధారణమైన కథ కాదని.. ఓ మహాకావ్యం – మహాభారతం ఆధారంగా ఉండే భారీ విజువల్ ఎపిక్ మూవీ అంటూ టాక్. రాజమౌళి జీవితంలోనే బడా డ్రీం ప్రాజెక్ట్ కూడా ఇదే అనడంలో అతిశయోక్తి లేదు. ఇప్పటికే చాలాసార్లు మహాభారతం తన లైఫ్.. డ్రీం ప్రాజెక్ట్ అంటూ పబ్లిక్‌గానే అనౌన్స్ చేసాడు రాజమౌళి. మహాభారం ఒక సినిమా లెవెల్లో.. స్టోరీ, క్యారెక్టర్, విజువల్ లెవెల్ సెటప్స్ అన్ని ప్లాన్ చేసుకోవడానికి కనీసం 15 ఏళ్ల సమయం పడుతుందని.. ఇండస్ట్రీ లెక్కలు వెల్లడించాయి. అంటే.. జక్కన్న వారణాసి కంప్లీట్ అయిన వెంటనే ఈ ప్రాజెక్టు పై పనులు మొదలుపెడితే.. మరో దశాబ్దం దాటిపోతుంది. ఇక ఈ ప్రాజెక్టు విషయం అలా ఉంచితే.. మరికొద్ది రోజుల్లో ఆర్ఆర్ఆర్2 కూడా వచ్చే అవకాశం ఉందని.. జక్కన్న మహాభారతం, ఆర్ఆర్ఆర్ రెండిట్లో ఏదైనా ప్లాన్ చేసి ఉండొచ్చనే టాక్ బలంగా వినిపిస్తుంది.
ఈ క్రమంలోనే రెండు ప్రాజెక్టులలో ఏది సెట్స్‌పైకి వస్తుందో చెప్పలేని పరిస్థితి. కానీ.. రాజమౌళి ఏ ప్రాజెక్ట్ పై పని చేయాలన్నా.. దానిపై భారీ స్కేల్, అద్భుత విజువల్స్, క్రియేటివ్ కాన్సెప్ట్ ఫిక్స్ చేసుకొని డిసైడ్ చేస్తాడు. ఇక మహాభారతం సెట్స్ పైకి వచ్చేసరికి ఏ స్టార్ హీరో, హీరోలు చేస్తారో అనే విషయంపై టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ డిబేట్ కొనసాగుతుందిజ ఇప్పటికే కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాజజ ఈ భారీ పాన్ ఇండియన్ ప్రాజెక్టులో భాగం కావాలని అందరి స్టార్ హీరోస్ పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక హీరోలు ఎవరైనా.. రాజమౌళి సినిమా రిలీజ్ అయితే మాత్రం ఫస్ట్ షో పాజిటీవ్ వైబ్ గ్యారెంటీ.

