నందమూరి బాలకృష్ణ అఖండ 2 తాజాగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో రిలీజ్ కాబోతున్న ప్రాజెక్టుల విషయంలో టెన్షన్ మొదలైంది. వందల కోట్ల బడ్జెట్ పెట్టి సినిమాల తీయడం అంటే ఫైనాన్స్ అనేది చాలా ప్రధానం. అదే ఫైనాన్స్‌లు క్లియర్ చేయకుండా సినిమా రిలీజ్ చేయాలంటే అది ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తిప్పలు తప్పవని తాజాగా అఖండ 2 డాటు రుజువు చేసింది.
ఈ క్రమంలోనే పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బడా ప్రాజెక్ట్ రాజాసాబ్ సంక్రాంతికి రిలీజ్ కావడం లేదని.. వాయిదా పడిందంటూ.. బాలీవుడ్ సంస్థకు రాజాసాబ్ ఫైనాన్స్ క్లియర్ చేయాల్సి ఉండగా.. అది పెండ్డింగ్ లో ఉంచ్చారని.. అందుకే సినిమా వాయిదా పడనుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక రాజాసాబ్ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 9 రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. గత కొన్ని రోజులుగా ఈ వార్తలు తెగ వైరల్ కావడంతో.. మూవీ ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఎక్స్ వేదికగా రియాక్ట్ అయ్యారు.
సినిమా రిలీజయ్యే చివరి నిమిషంలో అంతరాయం కలిగించడానికి ప్రయత్నించడం చాలా దురదృష్టకరమని.. ఇటువంటి చర్యలను తీవ్రంగా ఖండించాలని వెల్లడిచ్చాడు. ఇక రాజాసాబ్ కోసం తీసుకున్న ఫైనాన్స్ అన్నిటిని క్లియర్ చేశామని.. వడ్డీలు కూడా అనుకున్నదానికంటే ముందుగానే పూర్తి చేసామని.. రాజాసాబ్‌తో పాటు వస్తున్న సంక్రాంతి సినిమాలన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా రిలీజ్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానంటూ ట్విట్టర్ వేదికగా రాసుకోచ్చిన పోస్ట్ వైరల్ గా మారుతుంది.



