అఖండ 2 కోర్ట్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినా.. అక్కడ మాత్రం రెడ్ సిగ్నల్..!

బాలయ్య – బోయపాటి కాంబోలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 సినిమాకు ఈరోజ్‌ సంస్థతో నడుస్తున్న వివాదం కొలిక్కి వచ్చింది. ఈరోజు కోర్టులోను ఈ విషయంపై లైన్ క్లియర్ అయింది. సినిమా రిలీజ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 12న‌ సినిమాలు గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయాలని.. ఇక 11న రాత్రి 10 గంటల నుంచి ప్రీమియర్స్ చేయడానికి అంత సిద్ధం చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. త్వరలోనే దీనిపై మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించనున్నరట. ఇక.. ఈ వార్త లోకల్ డిస్ట్రిబ్యూటర్లకు పండగ లాంటిదని చెప్పాలి.

అయితే హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన.. ఓవర్సీస్ లో మాత్రం దీనికి రెడ్ సిగ్నల్ పడుతుంది. ఓవర్సీస్ పంపినదారుల్లో టెన్షన్ మొదలైందట. అసలు మేటర్ ఏంటంటే.. ఇండియా లాగా విదేశీ మార్కెట్లో రాత్రికి రాత్రి సినిమాలో రిలీజ్ చేయడానికి అసలు సాధ్యం కాదు.. అక్కడ ఏర్పాట్లు, మార్కెట్లో పరిస్థితి వేరుగా ఉంటాయి. సినిమాకు భారీ బిజినెస్ జరిగింది కనుక.. ఈ పెట్టుబడులు వెనక్కు రావాలంటే కనీసం వారం రోజులు ముందు నుంచి టికెట్ బుకింగ్స్, ప్రచార హడావిడి మొదలవ్వాలి.

కానీ.. ఇప్పుడు సడన్గా రెండే రోజుల్లో సినిమా టికెట్లు బుకింగ్స్ అంటే సేల్స్ కష్టమవుతాయి. ఇది పెద్ద రిస్క్ కావడంతో.. అక్కడి బయర్లు డిసెంబర్ 12న సినిమా రిలీజ్ చేయడానికి భయపడుతున్నారట.. ఈ డేట్ తెలుగు రాష్ట్రాల పంపిణీదారులకు అనుకూలంగా ఉండొచ్చు కానీ ఓవర్సీస్ లో మాత్రం థియేటర్లో సర్దుబాటు చేయడం కష్టమని.. కంటెంట్ డెలివరీ టయానికి అందడం పెద్ద సవాలుగా మారుతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.