గాడ్ఆఫ్ మోసెస్ బాలకృష్ణ, సెన్సేషనల్ డైరెక్టర్ బోయపాటి శీను హ్యాట్రిక్ కాంబోలో రూపొందిన లేటెస్ట్ మూవీ అఖండ 2.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఇప్పటికే రిలీజై థియేటర్లు కళకళలాడిపోయేవి. అయితే.. సినిమా ఎవరు ఊహించని విధంగా రిలీజ్ కు కొద్ది గంటల ముందు వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. డిసెంబర్ 5న గ్రాండ్గా రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. ఫైనాన్స్ కారణాలతో వాయిదా పడింది. సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత బాలయ్య – బోయపాటి కాంబోలో సినిమా రూపొందుతుండడం.. అది కూడా అఖండ లాంటి బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై ఆడియన్స్‌లో మొదటి నుంచి అంచనాలు ఆకాశానికి అంటాయి.
అయితే.. సినిమా రిలీజ్ డేట్ ప్రకటించిన తర్వాత.. హైప్ మరింత డబల్ అయింది. అయితే.. అనూహ్యంగా సినిమా వాయిదా పడటం బిగ్ షాక్ అనే చెప్పాలి. ఇక ప్రస్తుతం.. సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు మేకర్స్ రివీల్ చేస్తారా అంటూ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. త్వరలోనే దీనిపై మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్మెంట్ కూడా ఇవ్వనున్నారట. అయితే.. ఇప్పటివరకు సినిమా రిలీజ్ డేట్ పై అఫీషియల్ అనౌన్స్మెంట్ రాకపోయినా డిసెంబర్ 12న రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
అయితే ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాకపోవడంతో చిన్న సినిమాల రిలీజ్ విషయంలో అయోమయం మొదలైంది. అఖండ 2 కంటే ముందు ఈ ఏడాది డిసెంబర్ 12 కోసం మోగ్లీ, సైక్ సిద్ధార్థ ,ఇషా లాంటి చిన్న సినిమాలు రిలీజ్ కు అన్ని సిద్ధం చేసుకున్నాయి. కానీ.. ఇప్పుడు బాలయ్య నటించిన అఖండ 2 ని కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నారని టాక్ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే చిన్న సినిమాల పరిస్థితి ఎలా ఉండబోతుందని అయోమయం అందరిలోనూ మొదలైంది. ఇక ఈ సైలెన్స్‌ను ఎప్పుడు బ్రేక్ చేస్తారో.. దాని ప్రభావం చిన్న సినిమాలపై ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.


