ప్రస్తుతం సోషల్ మీడియా అంతా హాట్ టాపిక్‌గా మారుతున్న విషయమే అఖండ 2 వాయిదా. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎప్పుడు ఏం జరగబోతుందో ఊహించలేని పరిస్థితి. వారికైనా ఫైనాన్స్ ఈష్యులతో సడన్ షాక్‌లు తగులుతున్నాయి. అలా.. అఖండ 2.. డిసెంబర్ 5న రిలీజ్ కావాల్సి ఉండగా రిలీజ్ కు కొద్దిగా గంటల ముందు ఈరోజు సంస్థతో ఉన్న సమస్య కారణంగా అఖండ 2 ఆగిపోయింది. అయితే.. తాజాగా ఈ సమస్య సార్ట్ అవుట్ అయిందని.. వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేయబోతున్నారని వార్తలు వైరల్ అవుతున్నాయి. అది కూడా.. డిసెంబర్ 12న అఖండ 2 థియేటర్లలోకి రానుందని సమాచారం. అంటే.. డిసెంబర్ 11న.. రాత్రి 10 గంటల నుంచి సినిమా ప్రీమియర్ షోలు కూడా వేయనుందట. ఈ క్రమంలోనే.. డిసెంబర్ 12న రావాల్సిన మోగ్లీ సినిమా ను కూడా వాయిదా వేశారు.
ఇప్పటికే సినిమా డిసెంబర్ 12న థియేటర్లో రిలీజ్‌కు అని విధాలుగా ప్రమోషన్స్ ను కంప్లీట్ చేసి.. సినిమాపై హైప్‌ను క్రియేట్ చేశారు టీం. ఇలాంటి టైం లో అఖండ 2 ఎఫెక్ట్ మొగ్లీ వాయిదాకు కారణమైంది. దీంతో.. సినిమా డైరెక్టర్ సందీప్ రాజ్ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతూ వెండితెరకు నేనంటే ఎందుకు అంత ద్వేషం అంటూ ఎమోషనల్ అయ్యాడు. కలర్ ఫోటో లాంటి సినిమాతో దర్శకుడుగా రాజ్.. కనీసం ఇప్పటివరకు తన పేరు సిల్వర్ స్క్రీన్‌పై కూడా చూసుకోలేకపోయాను అంటూ ఎమోషనల్ అయ్యాడు. సందీప్ మాట్లాడుతూ.. బహుశా కలర్ ఫోటో అలాగే మొగ్లి నాకు బదులు.. మరొక దర్శకుడు తో రూపొందించాల్సింది. ఈ సినిమాలు తమ వృత్తి కోసం ఏదైనా చేయగల కొంతమంది ఉత్సాహవంతులైన వ్యక్తులతో నిర్మించబడింది అంటూ రాసుకోచ్చాడు.
ఇక.. ఈ రెండు సినిమాల మధ్యన కంపారిజన్ చేస్తూ ప్రతిదీ బాగానే జరుగుతుంది అనుకున్నప్పుడు.. వాటి రిలీజ్ విషయంలో ఊహించని ఆటంకాలు ఎదురవుతున్నాయి. బహుశా అది నా దురదృష్టమేమో.. నేను కూడా అదే నా బ్యాడ్ లక్ అనుకుంటున్నా దర్శకత్వం సందీప్ రాజ్ అనే టైటిల్‌ను వెండి తెరపై చూడాలని ఎన్నో ఎళ్ళ కల.. రోజు రోజుకు మరింత కష్టతరంగా మారింది. సిల్వర్ స్క్రీన్ నన్ను ద్వేషిస్తుందని అనిపిస్తుంది. రోషన్, సాక్షి, హర్ష, డిఓపి మారుతి, బైరవ మరియు మరెన్నో.. డేడికేషన్ తో ఉన్న చాలామంది వ్యక్తులు కష్టం, అభిరుచి. ఈ మొగ్లీ సినిమాకు వారి కోసమైనా అన్ని మంచి జరగాలని.. నేను నిజంగా కోరుకుంటున్న అంటూ సందీప్ ఎమోషనల్ అయ్యాడు. ఈ క్రమంలోనే సందీప్ ఎమోషనల్ పోస్ట్ వైరల్‌గా మారుతుంది.

