అఖండ 2 వివాదాలు క్లియర్.. మరికొద్ది గంటలోనే రిలీజ్..!

గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ, బోయపాటి శీను కాంబోలో అఖండ 2 తాండవం వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఫైనాన్స్ ఇష్యులతో సినిమా రిలీజ్‌కు కొద్ది గంటల ముందు సడన్గా వాయిదా పడడంతో.. ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. తాజాగా ఈ సినిమా వివాదాలు సద్దుమణిగాయని.. రిలీజ్‌కు రంగం సిద్ధమైనట్లు టాక్‌ నడుస్తుంది. ఓవర్సీస్‌లో రిలీజ్‌కు కాస్త ఇబ్బంది అవుతుందన్న ఒక్క కారణం తప్ప.. ఈ సినిమాను మరో మూడు రోజుల్లో.. అంటే డిసెంబర్ 12న రిలీజ్ చేసేందుకు మేకర్స్‌ ఫిక్స్ అయ్యారు. అఖండ 2 రిలీజ్‌కు అడ్డంకిగా నిలిచిన ఈరోస్ బకాయి వ్యవహారం.. నిన్న రాత్రి సెటిల్ అయిపోయిందట.

అయితే ఈ అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ విషయాన్ని నేడు కోర్టుకు ఇరుపక్షల వాళ్ళు తెలియజేయనున్నారు. ఈ క్రమంలోనే కోర్ట్‌ నుంచి నో అబ్జెక్షన్ లెటర్ వచ్చిన వెంటనే మంచి టైం చూసి కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్. ఇక ప్రొడ్యూసర్ల ఎప్పుడు సినిమా రిలీజ్ చేయాలనే ప్రశ్న‌కు.. ఫ్యాన్స్, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అంద‌రి నుంచి డిసెంబర్ 12న రిలీజ్ చేయాలనే స్ట్రెస్‌ మొదలైందట. సినిమాకు అనుకోకుండా మరింత హైప్ వ‌చ్చింది. దీంతో ఇదే రిలీజ్‌కు సరైన టైమ్ అంటూ డిస్టిబ్యూటర్లతో పాటు.. ఇటు అభిమానులు కూడా బలంగా నమ్ముతున్నారు.

ఈ క్రమంలోనే.. సినిమా రిలీజ్ అయితే కచ్చితంగా మంచి రిజల్ట్ అందుకుంటుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే.. జనవరి 12 తప్ప.. మరో రిలీజ్ డేట్ గురించి అసలు చెప్పడం లేదు. అయితే ఈ నెల 12న సినిమా రిలీజ్ చేయాలంటే.. కాస్త ఓవర్సీస్ రిలీజ్‌కు కష్టమే అవుతుంది. అప్పటికప్పుడు అక్కడ థియేటర్లను అరేంజ్ చేయడం అంత సులువు కాదు. ఈ క్రమంలోనే.. రిలీజ్ విషయంలో కాస్త నిర్ణయాన్ని మేకర్స్ స్ట్రాంగ్‌గా తీసుకోలేకపోతున్నారట. అది మినహాయించి.. సినిమా 12న‌ రిలీజ్ చేయాలని ఆల్మోస్ట్ ఫిక్స్ అయ్యారని.. 11న రాత్రి పది గంటల నుంచి ప్రీవియర్స్ రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ఇక మరికొద్ది గంటల్లో కోర్ట్‌ నుంచి స్టే తీసుకొచ్చిన వెంటనే సినిమా రిలీజ్‌ను అఫీషియల్ అనౌన్స్ చేయనున్నారట.