అఖండ 2: నెట్‌ఫ్లిక్స్ లెక్కలో బిగ్ ఛేంజ్.. నిర్మాతలకు భారీ లాస్ తప్పదా..!

సాధారణంగా సినిమా రిలీజ్ సడన్గా వాయిదా పడింది అంటే అది ఫ్యాన్స్‌కు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్‌గా మిగిలిపోతుంది. కానీ.. అఖండ 2 విషయంలో మాత్రం.. అది నిర్మాతలకే భారీ లాస్ వచ్చేలా చేస్తుంది. ఊహించని విధంగా రిలీజ్ డేట్ మారడంతో.. దాని ప్రభావం నేరుగా బిజినెస్ స్టిల్స్‌పై పడింద‌ట‌. ముఖ్యంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందం ఇప్పుడు అఖండ 2 మేకర్స్‌కు భారీ తలనొప్పిగా మారిందట. డేట్ మారితే అంతా సెట్ అవుతుందనుకుంటే.. అసలు సమస్య ఇక్కడే ప్రారంభమైందంటూ టాక్ నడుస్తుంది. ఎప్పుడు నెట్‌ఫిక్స్ ప్లానింగ్ పక్కగా ఉంటుంది.

డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ అయితే.. సరిగ్గా నాలుగు వారాలు అంటే సంక్రాంతి సెలవుల్లో సినిమా స్ట్రీమ్ చేసుకోవాలని ప్లాన్ చేశారు. పండగ టైంలో ఫ్యామిలీ అంతా ఇంట్లో కూర్చుని సినిమా చూస్తారు.. కనుక వ్యూవర్‌షిప్ వస్తుందని.. భారీ రేట్లు పెట్టి మరి అఖండ 2 రైట్స్ కొన్నారు. కానీ.. ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ డేట్ చేంజ్ అయింది. అంటే సంక్రాంతి టార్గెట్ మిస్ అవుతుంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం.. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదే జరిగితే మాత్రం సినిమా రిలీజ్ అయిన 15, 20 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. అప్పుడు.. థియేటర్‌ల‌లో కలెక్షన్లు దెబ్బతింటాయి. పోనీ స్ట్రీమింగ్ డేట్ మార్చితే.. నెట్‌ఫ్లిక్స్‌కు కుద‌ర‌దు.

ఈ క్రమంలోనే.. షెడ్యూల్ విషయంలో నెట్‌ఫ్లిక్స్‌ సంస్థ చాలా కచ్చితంగా వ్యవహరిస్తున్నారని.. ఇప్పుడే అఖండ 2 నిర్మాతలకు అసలైన పరీక్ష మొదలవుతుందంటూ సమాచారం. స్ట్రీమింగ్ డేట్ వాయిదా వేయాలని అఖండ 2 మేకర్స్.. నెట్‌ఫ్లిక్స్‌ను ఎలా క‌న్విన్స్ చేస్తారు.. ఒక వేళ వాళ్లు ఒప్పుకున్నా.. ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన డబ్బుల కోత‌ విధించే అవకాశం ఉంది. లేదంటే మూవీకి ప్రైమ్ టైం మిస్ అవుతుంది. కనుక రేట్లు తగ్గిస్తామని మెలిక పెడితే నిర్మాతలకు భారీ నష్టం తప్పదు. ఈ క్రమంలోనే ఆఖండ 2 విషయంలో మేకర్స్ కు ఎటు చూసినా తిప్పలు తప్పట్లేదు. పరిస్థితి ఊహించని సమస్యల వల్ల సినిమా వాయిదా పడడం కేవలం డేట్ మార్చడంతో ఆగిపోలేదు ఫైనాన్షియల్ గా కూడా గట్టి సమస్యగా మారింది. ఇప్పుడు ఈ పరిస్థితులను నిర్మాతలు ఎలా మార్చుకుంటారో.. ఎలాంటి పరిష్కారం వెతుక్కుంటారో చూడాలి.