అఖండ 2: బాలయ్య కనుకే ఆ సీన్స్ చేశారు.. మరొకరి వల్ల కాదు.. ప్రొడ్యూసర్స్

నందమూరి నట‌సింహం బాలకృష్ణ – బోయపాటి శ్రీను పవర్ఫుల్ హ్యాట్రిక్ కాంబోలో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ అఖండ 2 తాండవం. డివోషనల్, మాస్ యాక్షన్ థ్రిల్లర్గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచ‌నాలు నెలకొన్నాయి. ఇక సినిమా నుంచి టీజర్, ట్రైలర్, సాంగ్స్ అలా.. ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి ఒక్క అప్డేట్ ఆడియన్స్‌లో అంచనాలను పెంచేసింది. అఖండ 2 తాండవం 2d, 3d వర్షన్లలో డిసెంబర్ 5న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక.. సినిమాకు డిసెంబర్ 4 సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడనున్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా నిర్మాతలు రామ్ అచంట, గోపి ఆచంట సినిమా గురించి విలేకరులతో మాట్లాడారు.

Akhanda 2: Ram and Gopi Achanta confirm paid premieres

అఖండ 2 ప్రాజెక్ట్‌ ఎలా మొదలైంది అనే ప్రశ్నకు లెజెండ్ మేమే చేసాం.. 2014 ఎలక్షన్స్ కి ముందు వచ్చిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. అదే కాంబోలో.. మళ్లీ ఈ ఎలక్షన్స్ కి ముందు ఓ సినిమా చేయాలనుకున్నాం. అనుకున్న కథ‌ సరిగ్గా ఎలక్షన్స్ ముందే రిలీజ్ కావాలి.. అప్పుడే ఆ క్యారెక్టర్ కథ‌కు కనెక్ట్ అవుతుంది. సరిగ్గా ఎలక్షన్ డేట్ అనేది ఒక క్లారిటీ లేకపోవడంతో.. ఆ కథను పక్కన పెట్టేసి అఖండ 2 కథతో ముందుకు వెళ్దాం. బాలయ్య గారు, బోయపాటి గారి బ్లాక్ బ‌స్టర్ కాంబినేషన్ వరసగా హ్యాట్రిక్ సక్సెస్ తర్వాత మళ్ళీ వస్తున్న సినిమా ఇది. ఇక బాలయ్య గారిలో అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఎన‌ర్జీ. ఇంకా ఎనర్జీ పెరిగింది. ఆయనతో కూర్చుంటే ఆయన ఎనర్జీ మనకి కూడా వస్తుంది అంటూ వివరించారు.

ఇక.. ఈ సినిమా షూట్ కుంభమేళాలో కూడా జరిగింది. అక్కడ షూటింగ్ చేయాలంటే ఎన్నో పర్మిషన్స్.. మాకు అన్ని పర్మిషన్స్, డ్రోన్ పర్మిషన్ కూడా ఇచ్చారు. ఇప్పుడు మీరు సినిమాలో చూడబోయే ప్రతి సీన్ కేవలం సినిమా కోసం తీసిందే. స్టాక్ షార్ట్స్ ను అసలు ఎక్కడ ఉపయోగించలేదు. బోయపాటి గారి సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. టైంలో సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయి. సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి.. దేశం మొత్తం రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యాం. అయితే పాన్ ఇండియా కోసం అంటూ ప్రత్యేకంగా కథలో చేసిన మార్పులేమీ లేవు. ఇది పాన్ ఇండియన్ కంటెంట్.

Akhanda 2 teaser: Nandamuri Balakrishna's 'cringe' scenes leaves internet  divided: 'Even Bhojpuri cinema is ashamed' | Mint

ఈ కథ గ్లోబల్ గా అందరికీ కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దారు. సినిమాలో గూస్ బంప్స్ వ‌చ్చే సీన్స్‌ చాలానే ఉన్నాయి. బాలయ్య – బోయపాటి గారి నుంచి ఆడియన్స్ ఏదైతే ఆశిస్తారో.. అంతకుమించి సినిమా ఉంది అంటూ వివరించారు. శివుడంటే మాస్ కదా.. శివతాండవం ఎంత శక్తివంతంగా ఉంటుందో ఇందులో యాక్షన్ కూడా అదే రేంజ్ లో ఉంది. త్రిశూలం ఈ సినిమాలో వాడినట్టు మరే సినిమాలో వాడలేరు. అలాగే క్లైమాక్స్ అంతా జార్జియాలో చేసాం. మైనస్ డిగ్రీస్‌ చల్లిలో షూట్ ను కంప్లీట్ చేసాం. మేమిద్దరం వ‌ణుకుతూ స్వెటర్లు వేసుకుంటే.. బాలయ్య గారు ఆఘోర గెట‌ప్‌లో స్లీవ్ లెస్‌లో.. ఆ చలిలో కూడా అద్భుతంగా నటించాడు. ఆయన కనుక ఆ సన్నివేశాలు చేయగలిగారు. మరొకరైతే అంత చలిలో అలాంటి యాక్షన్ అసాధ్యం అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ప్రొడ్యూసర్లు చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.