తారక్ – ఆర్జీవి కాంబోలో ఓ మూవీ మిస్ అయిందని తెలుసా.. కారణం ఎవరంటే..?

టాలీవుడ్ లో నందమూరి నటసార్వభౌమ ఎన్టీఆర్ ఎన్నలేని సేవలు అందించిన సంగతి తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీకి మూల స్తంభంగా కూడా ఎన్టీఆర్ పేరు చెబుతూ ఉంటారు. తమిళ్ ఇండస్ట్రీలో గట్టి పోటీ నెలకొన్న క్ర‌మంలోను.. ఆయన తన సినిమాలతో సక్సెస్‌లు అందుకుని సత్తా చాటాడు. ఇక.. ఎన్టీఆర్ తర్వాత నందమూరి నటవారసులుగా ఎంతో మంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా.. ప్రస్తుతం ఆయన తనయుడు బాలకృష్ణ మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్‌లు అందుకోగలిగాడు.

ఇక.. నందమూరి ఫ్యామిలీ నుంచి మూడవ‌తరం హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్‌లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రారంభంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌ను మిస్ చేసుకున్నాడంటూ టాక్ వైరల్ గా మారుతుంది. తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు నటించి మెప్పించాడు. ఈ క్రమంలోనే సింహాద్రి సూపర్ సక్సెస్ సాధించిన తర్వాత.. ఆర్జీవి, జూనియర్ ఎన్టీఆర్‌తో ఓ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఎన్టీఆర్ కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా అది వర్కౌట్ కాలేదు.

కారణం ఎన్టీఆర్ తో సినిమా ప్రారంభించే టైంలో వర్మకు బాలీవుడ్ లో అమితాబ్ నుంచి ఆఫర్ రావడం. దీంతో ముందు అమితాబచ్చన్ సినిమా చేసి కొద్ది రోజుల తర్వాత ఎన్టీఆర్ తో సినిమా చేయాలని ఆయన భావించాడట. ఎన్టీఆర్ కూడా దానికి ఓకే చెప్పాడు. అయితే.. ఆ తర్వాత వర్మ ఎందుకో ఈ ప్రాజెక్టు గురించి అస్సలు ఆలోచించలేదట. ఈ క్రమంలోనే ఆర్జీవి, తార‌క్‌ కాంబోలో రావలసిన సినిమా ఆగిపోయిందని చాలామంది సినీ విశ్లేషకులు చెబుతూ ఉంటారు. ఇక వీళ్లిద్దరు కాంబోలో అప్పట్లో సినిమా వచ్చి ఉంటే మాత్రం అది కచ్చితంగా సూపర్ డూపర్ సక్సెస్ అందుకునేదని విమర్శకుల సైతం తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.