సౌత్ ఇండస్ట్రీలో హీరోయిన్గా తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సమంతా.. సినిమాలతోనే కాదు వ్యాపార రంగంలోను తన సత్తా చాటుకుంటుంది. గత కొంతకాలంగా అనారోగ్య కారణాలతో, వ్యక్తిగత కారణాలతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ అమ్మడు.. మళ్ళీ రీస్టార్ట్ కొట్టింది. ఫుల్ లెవెల్‌లో ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే.. వరుస సినిమాలకు సైన్ చేస్తుంది. మరో పక్క.. నిర్మాతగాను కొత్త అవకాశాలను అందుకుంటుంది. తాజాగా.. తన సొంత ప్రొడక్షన్ హౌస్ ట్రలాల మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారం ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.
.png?rnd=20200526195200&tr=w-900)
ఈ సినిమాకు పూజ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సమంత, దిగంత్, గుల్షన్ దేవాయ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో.. సీనియర్ యాక్టర్స్ గౌతమి, మంజుషా కీలక పాత్రల్లో మెరవనున్నారు. ఇక.. ఈ సినిమాకు ప్రొడ్యూసర్ గా సమంతతో పాటు.. హిమాంక్ దువ్వూరు వ్యవహరిస్తున్నారు. ఇక సమంత ఈ సినిమాతో పాటు.. బాలీవుడ్ వెబ్ సిరీస్ రక్త బ్రహ్మండ్‌లో మెరవనుంది. అయితే.. ఇండస్ట్రీ తో పాటు బిజినెస్ రంగాల్లోనూ తన సత్తా చాటుకుంటుంది సమంత.
గతంలోనే.. సాకీ పేరుతో క్లాత్ బ్రాండ్ ప్రారంభించి.. సక్సెస్‌ఫుల్గా రన్ చేస్తున్న ఈ అమ్మడు.. ఇటీవల పెర్ఫ్యూమ్ బిజినెస్‌లో కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మరో మరో కొత్త క్లాతింగ్ బ్రాండ్ ట్రూలీ స్మా ను ఇంట్రడ్యూస్ చేసింది. ఈ సందర్భంలో తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేసుకుంది. ఏ న్యూ చాప్టర్ బిగిన్స్ అనే క్యాప్షన్‌ను జోడించి.. పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. కొత్త వెంచర్ పై సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్‌లు ఆమెకు విషెస్ తెలియజేస్తున్నారు. సామ్ ఎంట్రెప్రిన్యూర్ గాను మంచి సక్సెస్ అందుకోవాలని.. సమంత స్టైల్ ఎప్పుడూ యూనిక్ గానే ఉంటుందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

