ఒకప్పుడు స్టార్ హీరోగా తిరుగులేని ఇమేజ్‌తో దూసుకుపోయిన వడ్డే నవీన్.. వరుస సినిమాలో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. తర్వాత ఇండస్ట్రీలో ఆయనకు అవకాశాలు లేకుండా పోయాయి. ఈ క్రమంలోనే వడ్డె నవీన్ గోల్డెన్ స్పూన్‌తో పుట్టాడని.. పొగరుతో అందరిని అవమానించే వాడని.. ఎవరిని లెక్కచేయకుండా తిరిగేవాడిని.. దీంతో ఇండస్ట్రీలో కెరీర్ లేకుండా పోయిందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇంతకీ సినీ ఇండస్ట్రీలో నవీన్ పై ఉన్న ఈ రూమర్ లో వాస్తవం ఎంతో ఒకసారి చూద్దాం. వడ్డే నవీన్ తండ్రీ వడ్డె రమేష్ టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కావడంతో.. నవీన్ కు మొదట చాలా అవకాశాలే వచ్చాయి. అలా.. గోల్డెన్ స్కూల్ తో పుట్టిన నవీన్.. ఎన్నో సినిమాల్లో అవకాశాలన్నీ అందిపుచ్చుకున్నాడు.

అయితే.. ఆయనకు మంచి టాలెంట్ కూడా ఉండడంతో.. తను నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్లు కాకపోయినా.. మంచి సక్సెస్‌లు అందుకున్నాయి. కొన్ని సినిమాలు యావరేజ్ టాక్ సైతం దక్కించుకున్నాయి. ఈ క్రమంలోనే.. మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న నవీన్.. సడన్‌గా ఇండస్ట్రీలో ఫేడౌట్ హీరోగా మారిపోయాడు. దానికి ప్రధాన కారణం నవీన్ కు ఉన్న పొగరేనని.. సినిమాల్లో ఆయనను తీసుకోవడానికి ఎవరు ఇష్టపడేవారు కాదంటూ ఓ టాక్ వైరల్ గా మారుతుంది. ఈ రూమర్‌పై రీసెంట్గా ఇంటర్వ్యూలో వడ్డే నవీన్‌తో కలిసి పని చేసిన డైరెక్టర్ చంద్ర మహేష్ రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ చంద్ర మహేష్.. వడ్డే నవీన్ తో కలిసి చెప్పాలని ఉంది సినిమాను చేశారు.
కాగా.. ఈ సినిమా స్టోరీ చెప్పడం కోసం నవీన్ ఇంటికి వెళ్ళా.. ఆయన చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు.. అలాగే రేపు సాయంత్రం మనం ఈ సినిమా గురించి మాట్లాడదామని చెప్పి ఆ తర్వాత కూడా అంతే బాగా రిసీవ్ చేసుకుని మర్యాదగా సార్ అంటూ మాట్లాడాడని చెప్పుకొచ్చాడు. ఎంతో ఉన్నతంగా మాట్లాడే వ్యక్తి. కానీ.. ఎందుకు ఆయనపై ఇలాంటి రూమర్లు క్రియేట్ అయ్యాయో అర్థం కాలేదు అంటూ చంద్ర మహేష్ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. టాలీవుడ్ లో వస్తున్న రూమర్ల గురించి నవీన్ దగ్గర ప్రస్తావించి ఎందుకు సార్ మీపై ఎలాంటి రూమర్లు వస్తున్నాయి.. మిమ్మల్ని చూస్తే అలా అనిపించడం లేదు కదా.. అని అడిగితే ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ చాలా కామన్.. సమాజంలో మన గురించి ఎవరో ఏదో మాట్లాడుతున్నారని వాటిని పట్టించుకోకూడదు అంటూ.. వడ్డే నవీన్ సమాధానం ఇచ్చాడని డైరెక్టర్ చంద్ర మహేష్ వెల్లడించాడు. ప్రస్తుతం చంద్ర మహేష్ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఆశ్చర్యపోతున్నారు. దగ్గర్నుంచి చూసిన వాళ్ళకే వాళ్ళ నిజమైన మనస్తత్వం ఏంటో అర్థం అవుతుందని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

