రాజమౌళి ప్రస్తుతం ఎస్ఎస్ఎంబి 29 షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. మహేష్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమా పాన్ వరల్డ్ రేంజ్లో తెరకెక్కుతుంది. ఈ క్రమంలోనే.. రాజమౌళి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎవరితో చేయబోతున్నాడు.. పాన్ వరల్డ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత.. రాజమౌళి తీయబోయే సినిమా ఏ హీరోతో ఉంటుందని ఆసక్తి అందరిలోనూ మొదలైంది. అయితే.. మొదట్లో ఈ అవకాశం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొట్టేసాడంటూ టాక్ నడిచింది. పుష్ప తో సాలిడ్ సక్సెస్ అందుకున్న బన్నీ.. ఇప్పుడు అట్లి డైరెక్షన్లో ఓ గ్లోబల్ ప్రాజెక్ట్‌లో నటించేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఖచ్చితంగా రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తాడని వార్తలు వైరల్ అయ్యాయి.
కానీ.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. మహేష్ తర్వాత రాజమౌళి.. బన్నీతో కాదు.. పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో మరోసారి సినిమా చేయబోతున్నాడట రాజమౌళి. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. బాహుబలి కి ఆప్షన్ గా మరో స్టోరీ తో ప్రభాస్ ను డైరెక్టర్ చేయాలని రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. ఈ విషయం నిర్మాత శోభు యార్లగడ్డ గతంలోనే వివరించాడు. ఆర్క మీడియా అధినేతలకు రాజమౌళి మొదట బాహుబలి స్టోరీని వినిపించినా.. అది భారీ బడ్జెట్ అవుతుందనే కారణంగా.. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్లో మరో స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశాడట జక్కన్న. ఈ విషయాన్ని శోభు వెల్లడించాడు. బాహుబలికి భారీ బడ్జెట్ అవుతుంది.. ఈ క్రమంలోనే శోభు నో చెబితే.. వెంటనే బాక్సర్ కథను వినిపించాలని ఫిక్స్ అయ్యాడట. ఈ క్రమంలో.. బాహుబలి తో ఒకసారి ముందుకెళ్ళిన తర్వాత.. వెనక్కి రాకూడదని అన్ని రకాలుగా ఆలోచించుకున్న తర్వాతే.. డెసిషన్ చెప్పమని జక్కన్నకు ముందుగానే హెచ్చరించాడట.
అన్ని ఓకే అనుకుంటేనే.. బాహుబలి సెట్స్‌పైకి వెళ్లాలని తెలిపారు. ఇక నిర్మాతకు ఒకేసారి అంత బడ్జెట్ అయితే రిస్క్ అవుతుంది కనుక.. రెండు భాగాలుగా సినిమా రిలీజ్ చేస్తే ఇబ్బంది ఉండదని.. అలా ప్లాన్ చేశాడు జక్కన్న. ఈ క్రమంలోనే మొదట అనుకున్న బాక్సర్ కథను భద్రంగానే ఉంచాడట. ఆ స్టోరీలో.. కేవలం ప్రభాస్ ఐతేనే బాగుంటుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్న రాజమౌళి.. ఆయన తప్ప మరో హీరోయిన్ తీసుకునే అవకాశం లేదని టాక్. ఇక బాక్సింగ్ లాంటి కథలకు ప్రభాస్ పర్ఫెక్ట్ కట్ అవుట్. ఇక.. ఆయనకు ధీటుగా రానా అయితేనే విలన్‌గా వర్కౌవుట్ అవుతాడు. ఈ క్రమంలోనే.. జక్కన్న మళ్ళీ బాక్సింగ్ కథను తీయాలని ఫిక్స్ అయిడట. అందులో హీరో ప్రభాస్ ఐతే.. విలన్ గా రానా అయ్యే అవకాశాలు ఉన్నాయని.. అంతటి బలమైన పాత్రను.. ఇతర భాష నటులకు ఇచ్చే రిస్క్ జక్కన్న చేయడంటూ టాక్.



