కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌గా తిరుగులేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వాళ్లలో లోకేష్ కనకరాజ్ ఒకడు. తాను తెరకెక్కించిన అతి తక్కువ సినిమాలతోనే ఆడియన్స్‌ను కనెక్ట్ చేసి మంచి సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలోనే.. పాన్ ఇండియా లెవెల్‌లో ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. తన మొదటి మూవీ మానాగరంతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్న లోకేష్.. తర్వాత ఖైదీ, మాస్టర్, విక్రమ్, లియోలతో వరుస బ్లాక్ బస్టర్లను అందుకుని పాన్ ఇండియా లెవెల్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్నాడు. ఇక.. లొకేషన్ నుంచి ఓ సినిమా వస్తుందంటే.. కథలో కొత్తతనం, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, ఎలివేషన్‌కు కొదవుండదు అని ఫ్యాన్స్ నమ్మే రేంజ్ కి ఎదిగాడు.

ఈ క్రమంలోనే.. లోకేష్ స్టైల్‌కు అంతా ఫీదా అవుతున్నారు. ఇక.. గత కొద్ది కలంగా లోకేష్ దర్శకత్వం బహించే ప్రతి సినిమాకు రూ.50 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే.. సౌత్ ఇండస్ట్రీలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాను డైరెక్టర్‌లలో కూడా ఒకడు. ఇక.. నిన్న మొన్నటి వరకు దర్శకుడుగా దూసుకుపోయిన లోకేష్.. తాజాగా మరో కొత్త అవతారం ఎత్తాడు. ఓ సినిమాలో హీరో గాను నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇప్పటికి దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఇక.. హీరోగా తన కొత్త జర్నీ కోసం కూడా లోకేష్ భారీగానే డిమాండ్ చేస్తున్నాడట.

హీరోగా.. తన డెబ్యూ మూవీకి లోకేష్ ఏకంగా రూ.35 కోట్ల మీద రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్‌లో సూపర్ స్టార్లుగా రాణిస్తున్న హీరోలు మాత్రమే ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ను అందుకుంటుండం విశేషం. ఈ క్రమంలోనే.. లోకేష్ దర్శకుడుగానే కాదు.. హీరోగాను రెమ్యునరేషన్ లెక్కల్లో కొత్త స్టాండర్డ్స్‌ను సెట్ చేస్తున్నాడంటూ టాక్ తెగ వైరల్‌గా మారుతుంది. ఇక ఇప్పటివరకు స్క్రీన్‌పై తన డైరెక్షన్ స్కిల్స్ చూసి ఫిదా అయిన ప్రేక్షకులకు హీరోగా.. లోకేష్ నటన, పర్ఫామెన్స్, యాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుందో తెలుసుకోవాలని ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే.. డైరెక్టర్గా సత్త చాటుతున్న లోకేష్.. హీరోగాను పాన్ ఇండియా లెవెల్‌లో తన సత్తా చాటుకుంటాడా.. లేదా.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

