టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు సన్నా డైరెక్షన్లో పెద్ది సినిమా షూట్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా.. ఉత్తరాంధ్ర ప్రాంతపు స్పోర్ట్స్ యాక్షన్ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతున్న సంగతాఇ తెలిసిందే. ఇక ఇప్పటికే సినిమా నుంచి ఫస్ట్ సింగల్ చిక్కిరి చిక్కిరి సాంగ్ రిలీజై అదిరిపోయే రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే.. సినిమాపై హైప్ మరింతగా పెరిగింది.
ఇక.. దాదాపు డిసెంబర్లో సినిమా నుంచి చరణ్ క్యారెక్టరైజేషన్‌ను వివరిస్తూ మరో ఎనర్జిటిక్ మాస్ సాంగ్ రానున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన మరో వార్త ప్రస్తుతం చక్కర్లు కొడుతుంది. ఎంతో ఎక్స్పీరియన్స్ ఉన్న నేషనల్ అవార్డును ఇప్పటికే సొంతం చేసుకున్న శోభన ఇందులో కీలక పాత్రలో నటించిందట.
ప్రస్తుతం ఈ వార్త ఆడియన్స్‌లో మరింత ఉత్సాహాన్ని పెంచుతుంది. సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంతో మందిని అప్రోచ్ అయినా బుచ్చిబాబు ఫైనల్‌గా శోభన అయితేనే ఆ రోల్‌కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందని.. తనదైన స్టైల్ లో ముద్ర వేస్తున్న శోభనను ఫిక్స్ చేసినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. శోభన గతంలో చరణ్ తండ్రి మెగాస్టార్ చిరుతో రుద్రవీణ, రౌడీ అల్లుడు సినిమాలో మెరిసింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం మెగా పవర్ స్టార్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటుందంటూ టాక్ వైరల్ అవడంతో ఫ్యాన్స్‌లో సినిమా పై ఆసక్తి పెరిగింది. శోభన లాంటి సీనియర్ యాక్టర్ ఎంట్రీ మరింత బలాన్ని చేకూరుస్తుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

