ప్రభాస్ ” స్పిరిట్ ” లో చిరంజీవి.. సందీప్ రెడ్డి క్లారిటీ.. !

టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్టులలో ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెర‌కెక్కనున్న స్పిరిట్ సినిమా సైతం ఒకటి. ఇక.. తాజాగా ప్రభాస్ బర్త్డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. సినిమా నుంచి ఆడియో అప్డేట్లు కూడా సందీప్ రిలీజ్ చేసి ఆడియన్స్‌లో హైప్ పెంచాడు. అయితే.. సినిమాలో మెగాస్టార్ చిరంజీవి నటించనున్న‌ట్లు గ‌త కొంత కాలంగా వార్తలు తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా.. సందీప్ రెడ్డి దీనిపై క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ లీడ్ రోల్‌లో నటిస్తున్న స్పిరిట్ సినిమాలో చిరంజీవి నటించట్లేద‌ని వివరించాడు.

Spirit': Prabhas to shed weight for Sandeep Reddy Vanga's cop drama; to  enter dark supernatural zone for the first time | - The Times of India

అవన్నీ కేవలం పుకార్లు మాత్రమే అని.. తెల్చి చెప్పేసాడు. ప్రభాస్ తండ్రి రోల్ కానీ.. మరే ఇతర పాత్రలోనైనా.. చిరంజీవి నటించిన చిరుతో కలిసి వేరే సినిమా చేస్తానని చెప్పుకొచ్చాడు. మరోవైపు స్పిరిట్ మూవీలో కొరియన్ యాక్టర్ డాన్లీ విలన్ పాత్ర పోషిస్తున్నాడని టాక్. దీనిపై మాత్రం సందీప్ రియాక్ట్ కాకపోవడంతో.. ఇందులో డార్లింగ్ నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక.. స్పిరిట్ సినిమా కోసం ప్రభాస్ తన కెరీర్‌లో మొదటిసారి ఓ పవర్‌ఫుల్ పోలీస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు.

Sandeep Reddy With Chiranjeevi: Tough But Brilliant | Sandeep Reddy With  Chiranjeevi: Tough But Brilliant

ఈ సినిమాలో తృప్తి దిమ్రి, ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రలో మెరవనున్నారు. కాగా.. ఈనెల ప్రారంభంలో ప్రభాస్ బర్త్డే లో భాగంగా సౌండ్‌ స్టోరీ అంటూ సందీప్ వంగా పంచుకున్న ఆడియో టీజర్ రివీల్ చేయ‌గా ఆ ఆడియో సినిమాపై హైప్ క్రియేట్ చేసింది. స్పిరిట్ ప్రపంచాన్ని పరిచయం చేసిన కథాంశం గురించి మాత్రం రివీల్ చేయలేదు. ఈ సినిమా 2026లో థియేటర్లో సందడి చేయనుంది. ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాగా.. స్క్రిప్ట్‌ టైంలో బిజిఎం గురించి కూడా క్లియర్ గా సందీప్ చెప్పేసాడు. ఈ స్పిరిట్ మూవీ విషయంలో మాత్రం మరో అడుగు ముందుకేసి.. మొత్తం డైలాగ్ వర్షన్ షూటింగ్ మొదలవక ముందే రికార్డ్ క్రియేట్ చేసినట్లు టాక్ నడుస్తుంది.