బిగ్బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం సక్సస్ ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రతి వారం అంతకంతకు ఆడియన్స్‌లో ఆసక్తిని పెంచేస్తున్నారు బిగ్ బాస్ టీం. ఈ క్రమంలోనే సీజన్ ముగ్గిసేందుకు మరో ఆరు వారాలు మాత్రమే సమయం ఉండడంతో.. హౌస్ లో హీట్ మరింతగా పెరిగింది. ఇప్పటివరకు 9 వారాల్లో ఎలిమినేషన్‌లు, రీ ఎంట్రీలు, సీక్రెట్ టాస్కులు అంటూ రకరకాలుగా నామినేషన్స్ పూర్తి చేసిన టీం.. ఈ వీక్ నామినేషన్ మాత్రం ఊహకందని రేంజ్‌లో ప్లాన్ చేశారు.. బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియను ప్రారంభించి.. హౌస్మెట్స్ చేసిన నామినేషన్స్‌ను తీసుకోకుండా.. తానే స్వయంగా హౌస్ లో మొత్తం 10 మందిని నామినేట్ చేయడం ఆడియన్స్‌కు కూడా బిగ్ షాక్ లాగా అనిపించింది.
అయితే కెప్టెన్ గా ఉన్న ఇమ్మానియేల్ విషయంలో మాత్రం బిగ్ బాస్ సరికొత్త మలుపు తిప్పాడు. కెప్టెన్సీ ద్వారా వచ్చే ఇమ్యూనిటీ ఇమ్ము వాడుకోవాలా.. లేదా.. అనే హౌస్‌లో వాళ్ళకి నిర్ణయాన్ని వదిలేశాడు. ఒక్క భరణి తప్ప మిగతా హౌస్ అంతా కెప్టెన్సీ ఇమ్యూనిటీ.. ఇమ్మానియేల్ కు రావాలని ఓటేశారు. దీంతో ఇమ్ము సేఫ్ అయిపోయాడు. మిగత 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక ఎవరి ఓటింగ్ ఏ రేంజ్ లో ఉంది.. ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారు.. ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారు అనే ఇన్ఫర్మేషన్ వైరల్ గా మారుతుంది. తాజా టాక్ ప్రకారం.. కళ్యాణ్ – 22.14% ఓటింగ్ తో మొదటి స్థానంలో, తనుజ – 21.97% ఓటింగ్ తో రెండవ స్థానంలో కొనసాగుతుండగా.. ఈ ఇద్దరి తర్వాత అసలు ఎవరు ఊహించని కంటెస్టెంట్ గౌరవ్ – 13.22 శాతం ఓటింగ్ తో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాడు. భరణి – 12.84% ఓటింగ్, రీతు చౌదరి – 10.7% ఓట్లతో సేఫ్ జోన్ లో నిలిచారని టాక్.

కాగా.. సంజన – 5 % , సుమన్ శెట్టి – 4.67% , డిమాన్ – 3.36%, దివ్య – 3.07% , నిఖిల్ – 2.78% ఓట్స్ మాత్రమే దక్కించుకున్నారు. అయితే.. తక్కువ ఓటింగ్ పొందడంతో ఎలిమినేషన్ జోన్‌లో ఈ ఐదుగురు నిలిచినట్లు క్లారిటీ వచ్చేసింది. ఓటింగ్ పూర్తి కావడానికి మరింత టైం ఉన్న క్రమంలో.. ఏ ఎపిసోడ్ లో నైనా ఓటింగ్ తారుమారు కావచ్చు. మొత్తం మీద పదో వారంలో ఈ అందరి నామినేషన్ ట్విస్ట్.. షోను మళ్లీ ట్రాక్ లోకి పెట్టినట్లు అనిపించింది. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు ఫైనల్ వైపుకు అడుగులు వేస్తారో తెలియాలంటే ఓటింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేవరకు వేచ్చి చూడాల్సిందే.


