టాలీవుడ్ నందమూరి నటసింహంకు ప్రస్తుతం గుడ్ టైం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే.. చివరిగా ఆయన నటించిన నాలుగు సినిమాలు సూపర్ హిట్‌లుగా నిలిచాయి. ఇక.. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 తాండవం సెట్స్‌లో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే.. బాలయ్య, బోయపాటి కాంబోలో సింహా, లెజెండ్, అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు తెరకెక్కి ఆడియన్స్‌ను విపరితంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే.. వీళ్లిద్దరు కాంబోలో తెరకెక్కుతున్న నాలుగవ సినిమా కావడం.. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీ రూపొందుతున్న క్రమంలో.. సినిమాపై ఆడియన్స్‌లో అంచనాలు పిక్స్ లెవెల్‌కు వెళ్ళాయి.
కేవలం బాలయ్య అభిమానులే కాదు.. సాధారణ ఆడియన్స్ సైతం సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక.. సినిమాను డిసెంబర్‌కు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. కాగా.. ఈ సినిమా రిలీజ్‌కు మరి కొంతకాలమే సమయం ఉన్న క్రమంలో.. థియేట్రికల్ బిజినెస్‌ను ప్రారంభించారు మేకర్స్. సినిమాపై ఉన్న హైప్ రిత్యా సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే.. మూవీ యూనిట్ ఓవర్సీస్ హక్కులను ఇప్పటికే అమ్మేసినట్లు సమాచారం.
ఇప్పటివరకు బాలయ్య కెరీర్‌లోనే లేని రేంజ్‌లో అత్యంత భారీ బడ్జెట్‌కు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం.. ఈ ఓవర్సీస్ హక్కులు మోక్ష మూవీస్ , సినీ గాలక్సీ మరియు శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా కొనుగోలు చేశారట. ఏకంగా రూ.15 కోట్ల భారీ థరకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఇక ప్రజెంట్ ఆడియన్స్‌లో పిక్స్ లెవెల్ అంచనాలను నెలకొల్పిన ఈ సినిమాతో బోయపాటి.. బాలయ్యకు ఎలాంటి రిజల్ట్ ఇస్తాడో.. ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తారో.. చూడాలి.


