పబ్లిక్ గానే ఆ పదం వాడుతూ.. అల్లు అర్జున్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన సమంత(వీడియో)..!

సమంత .. ఏం మాట్లాడినా సరే ఇప్పుడు సోషల్ మీడియాలో వెరీ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. సమంత మంచి మాట్లాడిన .. చెడు మాట్లాడిన సోషల్ మీడియాలో మాత్రం అది చెడుగానే పోట్రేట్ అవుతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత పై హ్యూజ్ నెగిటివిటీ నెలకొంది. రీసెంట్గా సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ఒక వీడియో బాగా ట్రెండ్ అవుతుంది .

మయోసైటిస్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న సమంత ఇప్పుడిప్పుడే మళ్ళీ జనాల్లోకి రావడం మొదలు పెట్టింది. రీసెంట్ గా తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న సమంత కాలేజీ స్టూడెంట్స్ తో INTERACT అయింది . ఈ క్రమంలోనే ఓ అభిమాని..” యాక్టింగ్ పరంగా మీ రోల్ మోడల్ ఎవరు..?” అని ప్రశ్నించారు . సమంతా రిప్లై ఇస్తూ..” ఎవర్గ్రీన్ అల్లు అర్జున్” అంటూ ఆన్సర్ ఇచ్చింది

“ఆయనతో నటించాలి అని మళ్లీమళ్లీ కోరుకుంటూనే ఉంటాను. ఆయన హై రేంజ్ పెర్ఫార్మెన్స్ నాకు చాలా చాలా ఇష్టం ..బీస్ట్ టాన్స్ఫార్మర్”అంటూ ఓ రేంజ్ లో పొగిడేసింది. సమంత వ్యాఖ్యలను ట్రెండ్ చేస్తున్నారు అల్లు అర్జున్ అభిమానులు. సమంతకి అల్లు అర్జున్ అంటే ఇంత ఇష్టమా అంటూ బాగా పొగిడేస్తున్నారు. ప్రజెంట్ అల్లు అర్జున్ పుష్ప2 సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు . ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మొత్తం మారిపోతుంది అంటూ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు..!!