ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్‌తో సంచ‌ల‌నం సృష్టించిన‌ ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..

సినీ ఇండస్ట్రీకి సంబంధించిన స్టార్ సెలబ్రిటీస్ ఫొటోస్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతూ ఉంటాయి. అయితే తాజాగా ఈ పై ఫోటోలో కనిపిస్తున్న ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈమె ఓ స్టార్ యాక్ట‌ర్‌. కొంతకాలం టాలీవుడ్‌కు బ్రేక్ ఇచ్చిన ఈమె ఇటీవ‌ల మ‌ళ్ళీ అడుగుపెట్టి.. బల్క్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా నటించి భారీ పాపులారిటీ దక్కించుకుంది.

ఇంతకీ ఈమె ఎవరో గుర్తుపట్టారా.. తన అందంతో నటనతో ప్రేక్షకులను మెప్పించి మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు ఎవరో కాదు శ్రేయ రెడ్డి. విశాల్ హీరోగా నటించిన పొగరు సినిమాలో లేడీ విలన్ గా పవర్ఫుల్ రోల్ లో నటించి ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక కొంతకాలం ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ తాజాగా వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ బిజీగా గడుపుతుంది. ఇటీవల పాన్ ఇండియన్ మూవీ సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సలార్‌లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. త్వరలోనే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమాలో కూడా అవకాశాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ.