“పెళ్లి అంటేనే ఒక బూతు”… వరలక్ష్మీ శరత్ కుమార్ హాట్ కామెంట్స్ వైరల్..!!

సినిమా ఇండస్ట్రీలో విలన్ అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది అబ్బాయిలే . అయితే లేడీ విలన్స్ ని మన ఇండస్ట్రీలో చాలా తక్కువ గా చూస్తుంటాం. అలాంటి వాటికి చెక్ పెడుతూ.. ఇండస్ట్రీలోకి సరికొత్త విధంగా ఎంట్రీ ఇచ్చింది నటుడు శరత్ కుమార్ కూతురు వరలక్ష్మి శరత్ కుమార్ . అమ్మడు హీరోయిన్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన సరే ఆ తర్వాత తనదైన స్టైల్ లో సినిమాలు చేసి తన బాడీ ఫిజిక్ హీరోయిన్ గా కంటే విలన్ గానే సెట్ అవుతుంది అని విలన్ గా మారిపోయింది. ఎలా అంటే క్రాక్ సినిమా హిట్ అవడానికి పూర్తి క్రెడిట్ గోపీచంద్ మలినేని జయమ్మ పాత్ర చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ కి ఇచ్చేశారు.

నిజానికి ఈ సినిమాలో విలన్ పాత్ర తర్వాతే వరలక్ష్మి శరత్ కుమార్ టాలీవుడ్ లో రేంజ్ లో ఎదిగిపోయింది . ఆ తర్వాత ఏకంగా బాలకృష్ణ సినిమాలో ఆఫర్ అందుకుంది . బాలయ్య కెరియర్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ ఆయనకు చెల్లిలుగా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేసింది . ఈ సినిమాతో ఎలాంటి క్రేజీ స్థానాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ప్రజెంట్ పలు తమిళ్ తెలుగు సినిమాలతో బిజీగా ఉన్న వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్గా ఓంకార్ హోస్ట్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షో కి వచ్చారు . ఆమెతో పాటు ఆమె జాన్ జిగిడి దోస్త్ బిందు మాధవి కూడా వచ్చారు.

ఈ సందర్భంగా పెళ్లి గురించి ఓంకార్ కామెంట్ చేయగా ..ఆమె క్రాస్ ఫింగర్ చూపించారు . అంటే దాని అర్థం బూతు అని . పెళ్లి మేటర్ నా వద్దకు తీసుకురావద్దు అంటూ చెప్పకనే చెప్పేసింది వరలక్ష్మి శరత్ కుమార్ . ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ..” పెళ్లి అన్ని సమస్యలకు పరిష్కారం అనుకుంటూ ఉంటారు ..అయితే నా విషయంలో అది నిజం కాదు.. ముందు మనల్ని మనం అర్థం చేసుకోవాలి ..ఆ తర్వాతే మన లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలి ..పూర్తి స్థాయిలో సన్నద్ధమయ్యాక మాత్రమే పెళ్లి చేసుకోవాలి “అంటూ పెళ్లి పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

“అంతేకాదు నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఇంత హిట్ ట్రాక్ సంపాదించుకోవడానికి మా నాన్న కారణమే కాదు.. నేను సినిమాలోకి రావడం మా నాన్నకి ఇష్టం లేదు. అది ఆయన ఓపెన్ గానే చెప్పుకొచ్చారు ఇక మా అమ్మకి ఫిలిం ఇండస్ట్రీకి ఎటువంటి సంబంధం లేదు. నా సక్సెస్ వెనుక ఉంది నేనే “అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్ . దీంతో సోషల్ మీడియాలో వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడిన మాటలు వైరల్ గా మారాయి..!!