సైకిల్ సైలెంట్ విక్టరీ..బాబు ప్లాన్ ఎప్పటిది!

ఏపీ ఎన్నికల్లో మరో సంచలనం చోటు చేసుకుంది..ఇన్నాళ్లు విజయాలకు దూరమైన ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి వరుస విజయాలు వస్తున్నాయి. ఇటీవలే మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించిన టి‌డి‌పి..తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించింది. అయితే పట్టభద్రుల స్థానాల్లో అధికార బలాన్ని ఎంత ఉపయిగించిన వైసీపీకి విజయం దక్కలేదు. ఆ ఎన్నికల్లో బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు.అలాగే పి‌డి‌ఎఫ్ తో రెండు ప్రాధాన్యత ఓటుపై అవగాహన పెట్టుకుని అనూహ్యంగా గెలుపు దక్కించుకున్నారు.

ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ లో కూడా ఆయన వ్యూహాలు పనిచేశాయి. మొదట నుంచి దీనిపై సైలెంట్ గానే ఆయన ముందుకెళ్లారు. సైలెంట్ గా వెళ్ళి సూపర్ విక్టరీ అందుకున్నారు. అయితే తమకున్న బలాన్ని నమ్ముకుని బాబు ముందుకెళ్లారు. 7 ఎమ్మెల్సీ స్థానాల్లో గెలిచే బలం వైసీపీకి లేదు..ఎందుకంటే వారి అసలు బలం 151 మాత్రం..ఒక్కో ఎమ్మెల్సీ గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు కావాలి. అంటే 7 గెలవాలంటే 154 కావాలి.

అయితే టి‌డి‌పి నుంచి వచ్చిన నలుగురు, జనసేన నుంచి ఒకరితో కలుపుకుని వైసీపీ బలం 156 అయింది. కానీ వైసీపీలో ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి..రెబల్ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. వారిని తీసేస్తే..154 బలం. అంటే కరెక్ట్ సంఖ్య. అందుకే 7 స్థానాల్లో పోటీ పెట్టారు. కానీ టి‌డి‌పికి అసలు బలం 23..కానీ నలుగురు వైసీపీలోకి జంప్ కొట్టారు. అయినా సరే తమ బలం ప్రకారం ఒక సీటు టి‌డి‌పికే దక్కాలని భావించి టి‌డి‌పి నుంచి పంచుమర్తి అనురాధని నిలబెట్టారు. విజయం సాధించారు.

టి‌డి‌పి రెబల్ ఎమ్మెల్యేలు టి‌డి‌పికి ఓటు వేయలేదు గాని..వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఇద్దరు..మరో ఇద్దరు క్రాస్ ఓటింగ్ చేసి టి‌డి‌పిని గెలిపించారు. అయితే బాబు ఎప్పుడో వైసీపీ క్రాస్ ఓటింగ్ చేస్తుందని గ్రహించి అనురాధ గెలుస్తారని నమ్మకంతో బరిలో దింపి గెలిచారు.