టాలీవుడ్ లో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చే సక్సెస్ అయిన వారిగా హీరో రవితేజ కూడా ఒకరు. ఇప్పటికే తన సినిమాలతో అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉన్నారు రవితేజ.ఇప్పుడు రవితేజ ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. రవితేజ సోదరుడు రఘు కుమారుడు మాధవ్ హీరోగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నారు. పెళ్లి సందD చిత్రంతో దర్శకురాలిగా పరిచయమైన గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రామానాయుడు స్టూడియోలో ప్రముఖ దర్శకుడు కే రాఘవేంద్రరావు నిర్మాత డి సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ షూటింగ్ కార్యక్రమాలు మొదలయ్యాయి.

రాఘవేందర్ రావు చేతుల మీదుగా దర్శక, నిర్మాతలకు కథను అందించడం జరిగింది. నిర్మాత సురేష్ బాబు కెమెరాను ఆన్ చేశారు. రవితేజ సోదరుడు రఘు గారి అబ్బాయి మాధవ్ హీరోగా పరిచయం చేయడం చాలా హ్యాపీగా ఉందంటూ నిర్మాత ఆనందాన్ని తెలియజేశారు. రవితేజ షూటింగ్లో బిజీగా ఉన్నందువల్ల ఈ సినిమా ఓపెనింగ్ కి రాలేకపోయారు. మంచి ఫ్యామిలీ నుంచి వస్తున్న మాధవ్ ఈ సినిమాతో సరైన హిట్ కొట్టాలని ఆశిస్తున్నామంటూ చిత్ర బృందం తెలియజేస్తోంది. ఈ సినిమా తన బ్యానర్ కి మంచి పేరు తెచ్చిపెట్టడంతోపాటు హీరోగా మాధవ్ కి మంచి చిత్రంగా నిలుస్తుందని ఆశిస్తున్నారు.

దర్శకురాలు మాట్లాడుతూ ఇది నా సెకండ్ డబ్ల్యూ మూవీగా భావిస్తున్నాను ఈ సందర్భంగా మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా గురువుగారి సురేష్ బాబు కి కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మా హీరో మాధవన్ ను నమ్మినందుకు నిర్మాత రవి గారికి థాంక్స్ అంటూ తెలియజేశారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.