ఆనం-కోటంరెడ్డితో నెల్లూరులో రివర్స్ గేర్!

కంచుకోట లాంటి నెల్లూరు జిల్లాలో వైసీపీకి రివర్స్ గేర్ పడుతుంది..ఇప్పటివరకు జిల్లాలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న పార్టీకి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కీలకమైన నేతలు అసంతృప్తి గళం విప్పడం, వారిని వైసీపీ అధిష్టానం సైడ్ చేసే ప్రయత్నాలు చేయడం లాంటి అంశాలు బాగా మైనస్ అవుతున్నాయి. జిల్లాలో కీలకంగా ఉన్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణరెడ్డిలు వైసీపీపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.

ఆఖరికి వైసీపీ అధిష్టానం తమ ఫోన్లని సైతం ట్యాప్ చేస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇంకా ఈ ఇద్దరు వైసీపీకి దూరం అవ్వడం ఖాయమని తేలిపోయింది. దీంతో వీరికి వైసీపీ అధిష్టానం సైతం చెక్ పెట్టేస్తుంది. కానీ ఎంత కాదు అనుకున్న ఈ ఇద్దరి వల్ల వైసీపీకి డ్యామేజ్ జరుగుతుందనే చెప్పాలి. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే నెల్లూరులో వైసీపీ డ్యామేజ్ పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

గత ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 10కి 10 సీట్లని వైసీపీ గెలుచుకున్న విషయం తెలిసిందే. కానీ నెక్స్ట్ ఎన్నికల్లో ఆ పరిస్తితి కనిపించడం లేదు. ఈ సారి టి‌డి‌పి కూడా సత్తా చాటేలా ఉంది. పైగా ఆనం-కోటంరెడ్డిలు గాని టి‌డి‌పిలోకి వెళితే వైసీపీకి డ్యామేజ్ తప్పదు. అసలు నెల్లూరు రూరల్ లో టి‌డి‌పికి పట్టు లేదు..కానీ కోటంరెడ్డి టి‌డి‌పిలోకి వస్తే..పట్టు పెరుగుతుంది. అటు ఆనం సైతం వస్తే నెల్లూరులో పలు స్థానాల్లో టి‌డి‌పికి ఆధిక్యం వస్తుంది.

ఆనంకు వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు సిటీ, రూరల్ స్థానాల్లో పట్టు ఉంది..ఆయన టి‌డి‌పిలోకి వస్తే ఆ సీట్లలో ప్లస్ అవుతుంది. ఓవరాల్ గా వైసీపీకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది.