గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఆంధ్రుడు హీరోయిన్..!!

సినీ ఇండస్ట్రీకి చాలామంది వస్తూ ఉంటారు పోతూ ఉంటారు.. కానీ కొంతమంది మాత్రము ఒకటి రెండు సినిమాతో సక్సెస్ అయ్యి ప్రేక్షక ఆదరణ పొందుతుంటారు.అలాగే అందంతో అభినయంతో ఆడియన్స్ హృదయాలను గెలుచుకున్న హీరోయిన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకొని ఆ తరువాత అదృష్టం కలిసి రాకపోవడంతో ఒకటి రెండు చిత్రాలు చేసి ఇండస్ట్రీకి దూరమైన వారిలో హీరోయిన్ గౌరీ పండిట్ కూడ ఒకరు.

Gowri Pandit Wiki Bio Age Husband Salary Photos Videos Ig Fb Tw - Celeb Wiki

ఈమె గోపీచంద్ హీరోగా నటించిన ఆంధ్రుడు సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమయ్యింది. ఈ సినిమాకి పరుచూరి మురళి దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2005లో రిలీజ్ అయింది. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఇక గౌరీ పండిట్ మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకుందనే చెప్ప వచ్చు. ఆ సినిమాలో అల్లరి ,దుఃఖం నటన ప్రేమ అన్నీ కలబోసి తీసిన ఆ సినిమాతో గౌరీ ప్రేక్షకులను మెప్పించింది.

అయితే ఆంధ్రుడు సినిమా తర్వాత గౌరీ పండిట్ పలు చిత్రాల్లో నటించింది.. కానీ అవేవీ ఈమెకు పెద్దగా సక్సెస్ ను తెచ్చి పెట్టలేదు. ఇక ఈమె తెలుగులోనే కాకుండా హిందీలోనూ కొన్ని సినిమాల్లో నటించింది. గౌరీ ఆ తరువాత 2011లో బాలీవుడ్ నటుడు నిఖిల్ ద్వివేదిని వివాహం చేసుకున్నారు. అంతేకాకుండా వీరికి ఒక బాబు కూడా ఉన్నారు. బాలీవుడ్ లో హౌస్ ఫుల్ చిత్రంలో నటించింది. ఆ తరువాత ఇండస్ట్రీకి దూరం అయిపోయింది గౌరీ పండిట్ అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గానే కనిపిస్తూ ఉంటారు. అంతేకాకుండా తన కుటుంబానికి సంబంధించిన విషయాలను పంచుకుంటూ జీవితాన్ని గడిపేస్తున్నది గౌరీ పండిట్.ఆంధ్రుడు సినిమాతో గౌరీ కే కాదు గోపీచంద్ కూడా మంచి పేరు గుర్తింపు వచ్చింది.