రేసింగ్ చేస్తున్న స్టార్ హీరోలు ఎవరో తెలుసా?

కార్ రేసింగ్ లేదా బైక్ రేసింట్ అంటే చాలా మందికి ఇష్టముంటుంది. ముఖ్యంగా యూత్ లో రేసింగ్ అంటే మంచి క్రేజ్ ఉంటుంది.. అయితే సాధారణ ప్రజలు కార్ రేసింగ్, బైక్ రేసింగ్ చేస్తే.. అది పెద్ద విషయం ఏమీ కాదు.. కానీ స్టార్ సెలబ్రిటీలు ఏదీ చేసిన అది వార్తే అవుతుంది..రేసింగ్ పై ఇష్టం ఉన్న వారిలో స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. హీరోలే కాదు హీరోయిన్స్ కూడా రేసింగ్ పై ఇంగ్రెస్ట్ పెంచుకున్నారు.. మరీ రేసింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆ స్టార్ సెలబ్రిటీలు ఎవరో చూద్దాం..

హీరో అజిత్:

హీరో అజిత్ కి రేసింగ్ అంటే చాలా ఇష్టమట.. మూవీస్ లో రాకముందు నుంచి ఆయన రేసింగ్ లో పాల్గొంటున్నారట.. రేసింగ్ చేస్తున్నప్పుడు హీరో అజిత్ ఒకసారి ప్రమాదానికి గురయ్యాడు. ఆ ప్రమాదంలో అజిత్ దాదాపు చావు అంచుల వరకు వెళ్లి వచ్చాడట.. అయితే తర్వాత అజిత్ సినిమాల్లో బిజీ అయ్యాడు.. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రేసింగ్ లో కూడా పాల్గొంటుంటాడు..

హీరో జై:

తమిళ హీరో జైకి కూడా రేసింగ్ అంటే చాలా ఇష్టం.. ఇందులో హీరో అజిత్ ని ఆదర్శంగా తీసుకున్నాడట.. హీరో జై సినిమాల్లో నటిస్తూనే ఫార్ములా వన్ రేసింగ్ లాంటి పోటీల్లో పాల్గొంటాడు..

హీరోయిన్ నివేదిత పేతురాజ్:

మెంటల్ మదిలో అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ నివేదిద పేతురాజ్.. అల్లు అర్జున్ నటించిన అలా వైకుంఠపురంలో కూడా నటించింది. ఈ బ్యూటీకి కూడా రేసింగ్ అంటే చాలా ఇష్టమట.. సినిమాల్లో నటిస్తూ ఫార్ములా వన్ రేసింగ్ కోర్సు కూడా పూర్తి చేసింది. ఇటీవల ఆ కోర్సుకు సంబంధించి సర్టిఫికెట్ కూడా పొందింది..

నాగచైతన్య:

అక్కినేని నాగచైతన్యకు కూడా రేసింగ్ అంటే చాలా ఇష్టట..అప్పుడప్పుడు సరదా కోసం రేసింగ్ లో పాల్గొంటూ ఉంటాడు. చైతన్యకే కాదు అక్కినేని కుటుంబానికి కార్లు అంటే చాలా ఇష్టం.. ఆ ఇంట్రెస్ట్ తోనే ప్రస్తుతం ఇండియాలోని ఒక రేసింగ్ కంపెనీలో పెట్టుబడి కూడా పెట్టారు..

Share post:

Latest