శ్రీ విష్ణు “భళా తందనాన” ట్రైలర్ ..నేటి రాజకీయనాయకులపై అదిరే పంచ్ !

టాలీవుడ్లో యువ కథానాయకులకు కొదవలేదు .ఒకొక్కరు ఒకొకపంథాలో వెళ్తున్నారు .ఆలా వెరైటీ పంథా లో వెళుతున్న యువ హీరో శ్రీ విష్ణు.టాలీవుడ్లో హీరోలుకొత్త కధలను ట్రైచేసేవారు కాదు , ఒకటే ఫార్ములాని నమ్ముకొని సేఫ్ గేమ్ ఆడేవారు.కాలంతో పాటు ట్రెండ్ మారింది .ట్రెండ్ తగట్టు కొత్తగా ట్రైచేస్తున్నారు మన యువ హీరోలు .శ్రీ విష్ణు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తుంటాడు. ఆ ప్రయత్నంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతుున్నా తట్టుకుని అదే కొత్త పంథాని తాను ప్రయత్నిస్తూ వచ్చాడు.

శ్రీ విష్ణుకి ఎప్పుడో వచ్చిన బ్రోచేవారుఎవరురా సినిమా తరువాత చాల సినిమాలు చేసిన అవి అతనకి నిరాశే మిగిల్చాయి . కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన ‘రాజ రాజ చోర’ పర్వాలేదు అనిపించుకొంది,కానీ సూపర్ హిట్ కాలేకపోయింది.అయితే విష్ణు నుంచి త్వరలో రాబోతున్న కొత్త సినిమా”భళా తందనాన” . నారా రోహిత్ తోలి పరిచయం చేసిన చైతన్య దంతులూరి ఈ సినిమాను రూపొందించాడు. అయన చేసిన రెండు సినిమాలు అయిన అందులో ఒక సోషల్ మెసేజ్ ఉన్న చిత్రాలే .అవే బాణం ,బసంతి సినిమాలు .తాజాగా రిలీజైన ఈ సినిమా టీజర్ ఆసక్తికరంగా అనిపిస్తోంది. నేటి రాజకీయాలపై కాస్త ఘాటైన పంచ్లు వేసాడు డైరెక్టర్ .ఈ చిత్రానికి సాయి కొర్రపాటి ప్రొడ్యూస్ చేస్తుండగా ,మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్నాడు ఈ చిత్రం ఫిబ్రవరి లో ప్రేక్షకుల ముందికి రానుంది