సీనియ‌ర్ హీరోల‌కు సై అంటున్న శ్రుతిహాస‌న్‌..కానీ, కండీష‌న్స్ అప్లై?!

చిరంజీవి, నాగార్జున‌, బాల‌కృష్ణ వంటి సీనియ‌ర్ స్టార్ హీరోల‌కు హీరోయిన్లు దొర‌క‌డం ఈ మ‌ధ్య కాలంలో బాగా క‌ష్ట‌మైపోయింది. ఇలాంటి త‌రుణంలో అలాంటి హీరోల కోసం మేమున్నాం అంటూ కొంద‌రు బ్యూటీలు ముందుకు వ‌స్తున్నారు. ఈ లిస్ట్‌లో తాజాగా శ్రుతి హాస‌న్ కూడా చేరింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..

Shruti Haasan: For me, the big step was taking therapy and acknowledging |  Bollywood - Hindustan Times

బోయ‌పాటి శ్రీ‌నుతో `అఖండ‌`ను పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని క్రాక్‌తో హిట్ అందుకున్నగోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ప్రారంభించాడు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం.. ఇటీవ‌లె పూజా కార్య‌క్ర‌మాల‌తో గ్రాండ్‌గా హైద‌రాబాద్‌లో ప్రారంభ‌మైంది. అలాగే ఈ చిత్రంలో బాల‌య్య‌కు జోడీగా శ్రుతి హాస‌న్ న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది.

Balakrishna and Shruti Haasan's film with Gopichandh Malineni goes on  floors. See pics - Movies News

దీనిపై ఇప్ప‌టికే అధికారిక ప్ర‌క‌ట‌న రాగా.. త్వ‌ర‌లోనే బాల‌య్య‌తో క‌లిసి రెగ్యుల‌ర్ షూటింగ్‌లో జాయిన్ కానుంది. ఇదిలా ఉంటే..వ‌రుస హిట్ల‌తో మంచి జోరు మీద ఉన్న శ్రుతి.. ఓవైపు యంగ్ హీరోల‌తో న‌టిస్తూనే మ‌రోవైపు బాలకృష్ణ వంటి సీనియర్ స్టార్ పక్కన ఆడిపాడటానికి అంగీకరించి చాలా మందిని ఆశ్చర్యపరిచింది.

Shruti Haasan going extra mile for Balakrishna?

అయితే బాల‌య్య స‌ర‌స‌న‌ న‌టించేందుకు శ్రుతిహాస‌న్ చాలా కండీష‌న్స్ పెట్టింద‌ట‌. అందులో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండకూడద‌ని, కాల్ షీట్ల‌ ప్ర‌కారం త‌న షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేయాల‌నే షరతులు ప్ర‌ధానంగా వినిపిస్తుండ‌గా.. వీట‌న్నిటికీ అంగీక‌రించే డైరెక్ట‌ర్ గోపీచంద్ మాలినేని ఆమెను తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

 

Share post:

Popular