బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!

November 22, 2021 at 12:07 pm

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా భీమ్లా నాయక్. యంగ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ కు ఈ మూవీ రీమేక్. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ సినిమాకు మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ కు అనుగుణంగా కథలు కూడా ఆయన మార్పులు చేసినట్లు తెలుస్తోంది.

సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీ ఈ సినిమా విడుదలవుతోంది. అయితే రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కూడా సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీ విడుదలవుతోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇండియా లెవెల్ లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో పాటు భీమ్లా నాయక్, ప్రభాస్ రాధే శ్యామ్ కూడా సంక్రాంతి సందర్భంగా విడుదలవనున్నాయి.

సంక్రాంతికి ఆర్ఆర్ఆర్ విడుదల అవుతుండటంతో భీమ్లా నాయక్ కు దెబ్బ పడుతుందని అంతా భావించారు. కానీ ఈ సినిమా అనూహ్యంగా విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తయింది. ఏకంగా ఈ సినిమా రూ.95 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు తెలుస్తోంది.

ఒకపక్క ఆర్ఆర్ఆర్, మరోపక్క ప్రభాస్ రాధే శ్యామ్ విడుదల అవుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమా రికార్డు స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఇప్పటికే భీమ్లా నాయక్ టీజర్, సాంగ్స్ ఓ రేంజ్ లో అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో ఇటు ట్రేడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

బరిలో ఆర్ఆర్ఆర్ ఉంటే ఏంటీ.. రికార్డులు షురూ చేసిన భీమ్లా..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts