పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో తెలుసా?

పెళ్లి.. మూడు ముళ్ళతో ఇద్దరు ఒకటయ్యే అపురూపమైన ఘట్టం. కానీ.., ఎవరికి పెళ్లి ఘడియలు ఎప్పుడు ఎలా వస్తాయో అస్సలు ఊహించలేము. లైఫ్ లో వెల్ సెటిల్ అయిన వారు పెళ్లికాక అవస్థలు పడుతుంటారు. మరికొంతమందికి మాత్రం అతి చిన్న వయసులోనే పెళ్లి అయిపోతూ ఉంటుంది. మరి.. మన స్టార్స్ లో ఎవరు, ఏ వయసులో పెళ్లి చేసుకున్నఆరో ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా ఆంధ్రుల ఆరాధ్య దైవం సీనియర్ యన్టీఆర్ నుండి మొదలు పెడదాం, యన్టీఆర్ సినిమాల్లోకి రాకముందే పెళ్లి చేసుకున్నారు. 20 వయసులోనే ఆయన బసవతారకం ను పెళ్లిచేసుకున్నారు. కానీ.., కెరీర్ లో నాన్నగారితో పోటీ పడ్డ అందగాడు అక్కినేని నాగేశ్వరరావు మాత్రం పాతికేళ్ల వయస్సులో పెళ్లి చేసుకున్నారు.

ఇక అన్నిటిలో దూకుడు ప్రదర్శించే సూపర్ స్టార్ కృష్ణ పెళ్లి విషయంలోనూ కాస్త తొందరపడ్డారు. ఈయన ఏకంగా 19 ఏళ్ళ వయసులోనే ఇందిరాదేవిని పెళ్లాడారు. ఇక మరో అందాల హీరో సోగ్గాడు శోభన్ బాబుకి పెళ్లి అయ్యే నాటికి వయసు ఎంతో తెలుసా? కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. లెజండ్రీ సింగర్ ఎస్పీ బాలు 1969లో 23 ఏళ్లకే పెళ్లి చేసుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం లైఫ్ లో సెటిల్ అయ్యాకనే పెళ్లి చేసుకున్నారు. పెళ్లి నాటికి ఆయన వయసు 30 సంవత్సరాలు.

1980లో మెగాస్టార్ చిరంజీవి అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్లాడారని అందరికి తెలుసా.కానీ.., అప్పటికి చిరంజీవి వయసు ఎంతో తెలుసా ? 24ఏళ్ళు. ఇక సౌత్ ఇండియా లెజండ్రీ యాక్టర్ కమల్ హాసన్ కూడా పెళ్లి విషయంలో చిరంజీవిని ఫాలో అయ్యాడు. 24 ఏళ్ళ వయసులోనే కమల్ పెళ్లి పీఠలు ఎక్కారు. ఇక నందమూరి బాలకృష్ణ 22ఏళ్ళ వయస్సులో వసుంధర దేవిని పెళ్లి చేసుకున్నారు. ఇక మన విక్టరీ వెంకటేష్ , నాగార్జున ఇద్దరు కూడా 24 ఏళ్ళ వయసులోనే పెళ్లిళ్లు చేసుకున్నారు. కానీ.., డాక్టర్ రాజశేఖర్ ది ప్రేమ వివాహం కదా? జీవితతో చాలా సంవత్సరాల ప్రేమ తరువాత రాజశేఖర్ 30 ఏళ్ళ వయసులో పెళ్లి చేసుకున్నారు.

ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి వివాహం 25ఏళ్ల వయస్సులోనే అయ్యింది. పెళ్లిచేసుకున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు 29ఏళ్ళ ప్రాయంలో నమ్రతను పెళ్లిచేసుకున్నాడు. ఇక ఇండస్ట్రీలో స్వయంకృషికి మారు పేరైన మాస్ మాహారాజా రవితేజ 32 ఏళ్ళు వచ్చే వరకు పెళ్ళి మాట ఎత్తలేదు.

ఇక జూనియర్ ఎన్టీఆర్ 28ఏళ్ళ వయస్సులో ఓ ఇంటి వాడయ్యాడు. అల్లు అర్జున్ కూడా ఇదే వయసులో తన ప్రేయసి స్నేహారెడ్డిని మనవు ఆడాడు. కానీ.., రామ్ చరణ్ మాత్త్రం 27ఏళ్ళకే ఉపాసనని పెళ్లి చేసుకున్నాడు. ఇక సమంతను పెళ్లాడే సమయానికి నాగచైతన్యకు 31ఏళ్ళు. కానీ.., రానా 35, నితిన్ 37 వయసులో పెళ్లి చేసుకుని అందరికి షాక్ ఇచ్చారు. చూశారు కదా? పెళ్లి చేసుకునే సమయానికి మన హీరోల వయస్సు ఎంతో. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కాలమెంట్స్ రూపంలో తెలియజేయండి.

Share post:

Latest