పవన్ కళ్యాణ్ బర్త్డే స్పెషల్ కేక్స్.. రేటెంతో తెలుసా..?

మన స్టార్ హీరోల బర్తడే అనగానే ఫుల్ హంగామా తో ఉంటుంది.ఇక ఈ రోజున పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా ఉండదు.ఇది పవన్ కళ్యాణ్ కు 50వ బర్తడే. అయితే ఆయన పుట్టినరోజు సందర్భంగా కొన్ని స్పెషల్ కేక్స్ చాలా ధరలు పలుకుతున్నాయి వాటి వివరాలను చూద్దాం.

తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తన అభిమానులు కేక్ కట్ చేస్తూ ఉంటారు.అయితే అభిమానుల అంచనాల ప్రకారం కేకులు ఈ రోజున లక్షకుపైగా కట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.ఈయన క్రేజ్ ఎలా ఉందంటే సోషల్ మీడియాలో తెలిపిన ప్రకారం..పవన్ కళ్యాణ్ బర్త్ డే కి ఒక అభిమాని కేక్ ఆర్డర్ ఇచ్చేందుకు వెళ్లగా..అక్కడ అప్పటికి 20 కేకులు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆర్డర్ ఉన్నట్లుగా తెలియజేశాడు.

Pawan Birthday Special Cakes

దీంతో ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారట.అలా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి కేకులను ఫోటోలు తీసి షేర్ చేశాడు.ఇక అంతే కాకుండా ఈ కేకు ధర దాదాపుగా 4000-10000 రూపాయల లోపు ఒక్కే కొన్నట్లు తెలుస్తోంది.ఇక అంతకంటే ఎక్కువ ధర కూడా ఉన్నట్లు సమాచారం.