ప‌వ‌న్ టైటిల్‌ను కొట్టేసిన బాల‌య్య భామ‌..వ‌ర్కోట్ అవుతుందా?

విద్యా బాలన్.. ఈ పేరుకు ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా రూపొందిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో బాల‌య్య జోడీగా న‌టించిన విద్యా బాల‌న్‌.. న‌ట‌న ప‌రంగా మంచి మార్కులే వేయించుకుంది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాలు చేస్తున్న ఈ భామ‌.. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్ టైటిల్ కొట్టేసింది.

THIS is what Vidya Balan has to say about not featuring with A-list  superstars in her movies | Hindi Movie News - Times of India

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విద్యాబాలన్, షెఫాలీ షా ప్రధాన పాత్రల్లో సురేష్ దర్శకత్వంలో ఓ చిత్రం తెర‌కెక్కుతోంది. బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ టి-సిరీస్, అబుడెన్షియా ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. దీనికి `జల్సా` అనే టైటిల్‌ను కన్‌ఫర్మ్ చేశారు మేక‌ర్స్‌.

Vidya Balan and Shefali Shah team up for Jalsa, first look out

తాజాగా ఈ సినిమా సెట్స్ మీద‌కు కూడా వ‌చ్చింది. రోహిణి హట్టంగడి, ఇక్బాల్ ఖాన్, విధాత్రి బండి త‌దిత‌రులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మ‌రి ప‌వ‌న్ క‌ళ్యాణ్ హిట్‌ టైటిల్ విద్యా బాల‌న్‌కు ఎంత వ‌ర‌కు వ‌ర్కోట్ అవుతుందో చూడాలి.