న్యూ లుక్ లో పవన్ ఫోటోస్ వైరల్…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు టాలీవుడ్ లో ఉన్నక్రేజ్ అంతా ఇంతా కాదు. మెగాస్టార్ చిరంజీవి కంటే ఫ్యాన్ ఫాలోయింగ్ పవర్ స్టార్ కి ఎక్కువగా ఉంది. ఓ వైపు జనసేనపార్టీ పెట్టి ప్రజలకు చేరువవుతూనే మరో వైపు పవన్ కళ్యాణ్ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం ఆయన బీమ్లా నాయక్ సినిమా చేస్తున్నాడు. ఇంకా మరో రెండు సినిమాలు షూటింగ్ ను జరుపుకుంటున్నాయి.

ఇదిలా ఉండగా పవర్ స్టార్ ఈ మధ్యకాలంలో మూవీస్ కు సబంధించి వార్తల్లోకెక్కుతున్నాడు. ఆయన తాజాగా తీసుకున్న ఓ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ హల్ చల్ చేస్తోంది. ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. నుదుటిపై కుంకుమ పెట్టకుని ఉన్నాడు. ఓ కుర్చీలో కూర్చుని పవన్ కాస్త కూల్ గానే ఉంటూ కనిపిస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు.

Share post:

Latest