బన్నీ సరసన అనన్య పాండే..?

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్ అనన్య పాండే ప్రజెంట్ పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో వస్తున్న పాన్ ఇండియా ఫిల్మ్ ‘లైగర్’తో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో రౌడీ హీరో విజయ్ దేవరకొండకు జోడీగా నటిస్తోంది. ఈ భామ ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో బాలీవుడ్‌లో డెబ్యూ కాగా ఆ సినిమాతో మంచి పేరు సంపాదించుకుంది.

అందం ప్లస్ అభినయంతో పాటు ఈ తరం నటీమణులకు ఉండాల్సిన డ్యాన్సింగ్ స్కిల్స్ కూడా అనన్యకు ఉన్నాయి. కాగా, ఈ భామ ‘లైగర్’ ఫిల్మ్ తర్వాత ప్రెస్టీజియస్ టాలీవుడ్ ఫిల్మ్ లో నటించబోతున్నదనే వార్తలు వినిపిస్తున్నారు. ‘వకీల్ సాబ్’ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్‌లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న ‘ఐకాన్’ సినిమాలో బన్నీకి జోడీగా నటించబోతుందట. అయితే, ఇందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే ఇంకా రాలేదు. బన్నీ ప్రస్తుతం పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప’ షూటింగ్‌లో ఫుల్ బిజీగా ఉన్న సంగతి అందరికీ విదితమే.

Share post:

Latest