అమలాపురంలో ఆమిర్ ఖాన్ సందడి..!

August 13, 2021 at 4:22 pm

బాలీవుడ్ సినిమాల చిత్రీకరణ చూస్తే వాళ్ళ రేంజ్ లోనే ఉంటాయి. మన సౌత్ ఇండియా లొకేషన్స్ కనిపించడం చాలా అరుదుగా ఉంటుంది.ఒకవేళ మన సౌత్ లో షూటింగ్ చేయాలనంటే మహా నగరాలూ అయిన హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి ప్రదేశాలలో మాత్రమే చేస్తారు. అయితే ఈసారి కొత్తగా ఈ బాలీవుడ్ హీరో చూపు తెలుగు రాష్ట్రంలోని ఒక చిన్న ఊరుపై పడింది. ఇంతకీ ఆ బాలీవుడ్ స్టార్ ఎవరు అనుకుంటున్నారు..బాలీవుడ్ లో మంచి క్రెజ్ ఉన్న సీనియర్ హీరో ఆమిర్ ఖాన్. అంతటి బడా హీరో తన కొత్తగా తీయబోయే చిత్రం యొక్క షూటింగ్ కోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలోని అమలాపురం అనే టౌన్‌కు వచ్చారు.అమీర్ ఖాన్ నటించబోయే కొత్త చిత్రం ‘లాల్ సింగ్ చద్దా’ ఈ సినిమా షూటింగ్ లో భాగంగా అమలాపురానికి వచ్చినట్లు సమాచారం. అయితే అమలాపురంతో పాటు కాకినాడ పోర్టులో కూడా కొంతభాగం షూటింగ్ జరగనుందట.

Laal Singh Chaddha: Aamir Khan shoots for Hindi adaptation of Forrest Gump in Andhra Pradesh | Celebrities News – India TV
ఈ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాలో మన టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని ఈ సంవత్సరం క్రిస్మస్‌కు రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు చిత్ర బృందం. !

అమలాపురంలో ఆమిర్ ఖాన్ సందడి..!
0 votes, 0.00 avg. rating (0% score)


Related Posts