బాహుబలి దూకుడు దెబ్బకు ఇండియన్ సినిమా స్క్రీన్ షేక్ అవుతోంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్ల వసూళ్లు రాబట్టిన బాహుబలి 2 బాక్సాఫీస్ వద్ద వీరంగం ఆడుతోంది. కేవలం 3 రోజుల్లోనే 500 కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమా ఏ ఇండియన్ సినిమాకు దక్కని ఘనత సొంతం చేసుకుంది.
తొలి మూడు రోజులకు బాహుబలి 2 హిందీ వెర్షన్లో మాత్రమే రూ. 128 కోట్లు కొల్లగొట్టింది. మూడు రోజులకు గాను ఏపీ+తెలంగాణలో 74 కోట్ల షేర్ రాబడితే 4 రోజులకు 89.07 కోట్ల షేర్ రాబట్టింది. అమెరికాలో రూ.64 కోట్లు కొల్లగొట్టి అక్కడ ఫస్ట్ వీకెండ్ పరంగా అమెరికా బాక్సాఫీస్‌లో టాప్-3 ప్లేస్‌లో నిలిచింది.
ఓవరాల్‌గా ఇండియాలో అన్ని వెర్షన్లలోను రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబడితే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్, అమెరికాలో కలిపి రూ. 125 కోట్లు కొల్లగొట్టింది. దీంతో 3 రోజుల మొత్తం గ్రాస్ రూ. 540 కోట్లు రాబట్టింది. ఇక తెలుగులో తొలి రోజు రూ.42 కోట్ల షేర్ రాబట్టిన బాహుబలి 2, 3 రోజులకు 74 కోట్లు, 4 రోజులకు 89 కోట్లు వసూలు చేసింది.