సీఎంగా జ‌య జీతం ఎంతో తెలుసా…ఇదీ ఓ రికార్డు

ప్ర‌భుత్వాధినేత‌లంటే వారి జీతాలు ల‌క్ష‌ల్లోనే ఉంటాయి. వారు ఎప్ప‌టిక‌ప్పుడు శాస‌న‌స‌భ‌లు, లోక్‌స‌భ‌ల్లో తీర్మానాలు చేయించుకుని మ‌రీ జీతాలు పెంచేసుకుంటారు. వారికి అన్నింట్లోను రాయితీలు ఉన్నా జీతాలు మాత్రం స‌రిపోవ‌ట‌. వీరి లెక్క ఎలా ఉన్నా త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మాత్రం ఈ విష‌యంలో ఎంతో ఉన్న‌త‌మైన వ్య‌క్తిత్వాన్ని చాటుకున్నారు. ఆమె సీఎంగా ప‌నిచేసిన‌న్ని రోజులు ఆమె నెల‌కు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే జీతం తీసుకున్నారు.

ఆమె సీఎం అయిన తొలినాళ్ల‌లో త‌న‌కు జీత‌మే వ‌ద్ద‌ని చెప్పారు. త‌న‌కు తాను జీవ‌నానికి స‌రిప‌డా ఆస్తులు, ఆదాయ వ‌న‌రులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని..త‌న‌కు అస‌లు జీత‌మే వ‌ద్ద‌ని ఆమె తెలిపారు. అయితే భార‌త రాజ్యాంగంలో పేర్కొన్న దాని ప్ర‌కారం రాష్ట్రాల్లో ముఖ్య‌మంత్రుగా ఉన్న వారు త‌ప్ప‌నిస‌రిగా జీతం తీసుకోవాలన్న నిబంధ‌న ఉంది.

ఆ నిబంధ‌న పాటించాల్సి ఉండ‌డంతో ఆమె అప్ప‌టి నుంచి నెల‌కు కేవ‌లం ఒక్క రూపాయి మాత్ర‌మే జీతం తీసుకుంటూ వ‌స్తున్నారు. ఆమె అప్ప‌టి నుంచి తాను మ‌ర‌ణించే వ‌ర‌కు సీఎంగా నెల‌కు ఒక్క రూపాయి జీతం మాత్ర‌మే తీసుకుంటూ దేశంలో అన్ని రాష్ట్రాల సీఎంల‌కు ఎంతో ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

నెల‌కు ఒక్క రూపాయి జీతం తీసుకున్న సీఎంల‌లో జ‌య క‌న్నా ముందే త్రిపుర సీఎం మాణిక్ స‌ర్కార్ ఉన్నారు. కమ్యూనిస్టు నేత అయిన మాణిక్ సర్కార్ ఆస్తులు గట్టిగా మూడు లక్షల లోపే. 1998 నుంచి ఆయన త్రిపురకు సీఎంగా ఉన్నారు. ఇలా జ‌య త‌క్కువ జీతంతో దేశంలో సీఎంల‌కు కూడా ఆద‌ర్శంగా నిలుస్తూ మ‌రో రికార్డు త‌న పేరిట లిఖించుకున్నారు.