మ‌హేష్ – మురుగదాస్ మూవీ షాకింగ్ ట్విస్ట్‌

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్‌బాబుకు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌హేష్ స్థాయికి త‌గిన హిట్ ప‌డితే పాత రికార్డుల‌న్ని ఖ‌ల్లాసే. కొర‌టాల శివ డైరెక్ష‌న్‌లో మ‌హేష్ హీరోగా వ‌చ్చిన శ్రీమంతుడు సినిమా మ‌హేష్ స్టామినా ఏంటో సౌత్ ఇండియాకు చూపించింది. ఇక మ‌హేష్ క్రేజ్‌కు ఇప్పుడు సౌత్ ఇండియ‌న్ భారీ చిత్రాల ద‌ర్శ‌కుడు ఏఆర్‌.మురుగ‌దాస్ తోడ‌య్యాడు.

అటు మ‌హేష్‌, ఇటు మురుగ‌దాస్ వీరిద్ద‌రి కాంబోలో సినిమా అంటేనే సౌత్ ఇండియాలో ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న సినిమా ఇప్ప‌టికే సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ప్ర‌తిష్ఠాత్మ‌క ప్రాజెక్టుల్లో ఒక‌టిగా క్రేజ్ తెచ్చుకుంది. ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులే కాక ఇండస్ట్రీ  మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ఈ సినిమాకు సంబంధించిన భారీ షెడ్యూల్ ప్ర‌స్తుతం గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో న‌డుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఫ్యాన్స్‌కు ఓ గుడ్ న్యూస్ వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ సైతం రిలీజ్ చేయ‌లేదు. సినిమాకు టైటిల్ ఏమై ఉంటుంది ? అన్న దానిపై సినీ వ‌ర్గాల్లో చాలా ఆస‌క్తి నెల‌కొంది.

న్యూ ఇయ‌ర్ కానుక‌గా జ‌న‌వ‌రి 1, 2017న ఈ సినిమా టైటిల్ లోగో రిలీజ్ చేస్తార‌ని, రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా జనవరి 26న ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మ‌హేష్ అండ‌ర్ క‌వ‌ర్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తుండ‌డంతో పాటు సినిమా స్టోరీ దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో ఉండ‌డంతో రిప‌బ్లిక్ డే నాడు ఫ‌స్ట్ లుక్ రిలీజ్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం.

ఠాగూర్ మధు. ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రంలో క్రేజీ హీరోయిన్‌ రకుల్ ప్రీత్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్.జె.సూర్య విలన్ పాత్ర‌లో క‌నిపించబోతుండ‌టం విశేషం. హ‌రీష్ జైరాజ్ ఈ సినిమాకు స్వ‌రాలందిస్తున్నారు.