మ‌హేష్ – కొర‌టాల మూవీ టైటిల్ ఫిక్స్‌..!

సూపర్ స్టార్ మహేష్ – దర్శకుడు కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘శ్రీమంతుడు’ అనే సినిమా ఎన్ని సంచ‌ల‌నాలు క్రియేట్ చేసిందో తెలిసిందే. టాలీవుడ్‌లో చ‌రిత్ర క్రియేట్ చేసిన బాహుబ‌లి సినిమా త‌ర్వాత సెకండ్ ప్లేస్ శ్రీమంతుడిదే. అదే కొర‌టాల మూడో సినిమా జ‌న‌తా గ్యారేజ్ సైతం టాలీవుడ్ టాప్‌-3 సినిమాల‌లో టాప్‌-3 ప్లేస్‌లో ఉంది. ఇక మ‌హేష్‌-క్రేజీ డైరెక్ట‌ర్ కొర‌టాల కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తోన్న మ‌హేష్ ఈ సినిమా కంప్లీట్ అయిన వెంట‌నే కొర‌టాల శివ సినిమాలో న‌టించ‌నున్నాడు. వచ్చే ఏడాది జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమా పొలిటిక‌ల్ నేప‌థ్యంలో ఉంటుంద‌ని, మ‌హేష్ సీఎంగా కూడా క‌నిపిస్తాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ సినిమా టైటిల్ గురించి అప్పుడే ర‌క‌ర‌కాల ఊహాగానాలు వినిపించాయి.

వాటిల్లో ‘భరత్ అనే నేను’ టైటిల్ బాగా పాపులర్ అయింది. ఇదే టైటిల్ ఖరారు కావొచ్చని బాగా వినిపించింది. తాజాగా ఈ సినిమాను నిర్మిస్తోన్న డీవీవీ దానయ్య సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇదే పేరును రిజిష్టర్ చేయించారు. దీంతో ఈ సినిమాలో హీరో పేరు భ‌ర‌త్ అని ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇక నిర్మాణ సంస్థ కూడా ఇదే పేరు రిజిస్ట‌ర్ చేయించ‌డంతో త‌ప్ప‌కుండే ఇదే ఈ సినిమా టైటిల్ అవుతుంద‌ని టాలీవుడ్‌లో అంద‌రూ లెక్క‌లు వేస్తున్నారు.

రవి కే.చంద్రన్, దేవిశ్రీ ప్రసాద్ లాంటి టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తోన్న ఈ సినిమాకు కొరటాల శివ ఓ కొత్త హీరోయిన్‌ను ఎంపిక చేసే పనిలో ఉన్నారు.