ఫ్యాన్స్‌కు ప‌వ‌న్ న్యూ ఇయ‌ర్ గిఫ్ట్‌

సర్దార్ గబ్బర్ సింగ్ లాంటి డిజాస్ట‌ర్ మూవీ త‌ర్వాత ప‌వ‌న్ లాంగ్ గ్యాప్ తీసుకుని వ‌రుస‌పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ప‌వ‌న్ ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా త‌ర్వాత స్టార్ ప్రొడ్యుస‌ర్ ఏఎం.ర‌త్నం నిర్మాత‌గా ఆర్‌టి.నీశ‌న్ డైరెక్ష‌న్‌లో రూపొందే మ‌రో సినిమాలో కూడా న‌టించ‌నున్నాడు. ఈ సినిమాకు స‌మాంత‌రంగానే మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ డైరెక్ట్ చేసే మ‌రో సినిమా కూడా ప‌వ‌న్ న‌టిస్తాడు.

ఇక ప‌వ‌న్ ప్ర‌స్తుతం న‌టిస్తోన్న కామ‌ట‌రాయుడు వ‌చ్చే యేడాది మార్చి చివ‌రి వారంలో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అందుకు త‌గ్గ‌ట్టుగానే ఈ సినిమా షూటింగ్ సైతం చాలా స్పీడ్‌గా జ‌రిగిపోతోంది. ఇక న్యూ ఇయ‌ర్ కానుక‌గా ప‌వ‌న్ త‌న అభిమానుల‌కు ఓ స్పెష‌ల్ గిఫ్ట్ రెడీ చేశాడు.

ప్ర‌స్తుతం పొలాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకుంటోన్న ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ ప‌వ‌న్ హాలీడే నుంచి తిరిగి రాగానే స్టార్ట్ కానుంది. ఇక న్యూ ఇయ‌ర్ కానుక‌గా న్యూ ఇయ‌ర్ విషెస్‌తో కాటమరాయుడు పోస్టర్ విడుదల చేస్తారట. ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత శరత్ మరార్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

కోలీవుడ్‌లో అజిత్ హీరోగా తెర‌కెక్కి సూప‌ర్ హిట్ అయిన వీర‌మ్ సినిమాకు రీమేక్‌గా వ‌స్తోన్న ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా శృతీహాస‌న్ న‌టిస్తోంది.