” ధృవ ” కు ” 8 ” నెంబ‌ర్‌కు లింక్ ఇదే

మెగాప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్ తేజ్ – సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న ధృవ సినిమా మ‌రో రెండు రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. కోలీవుడ్ హిట్ మూవీ త‌నీ ఒరువ‌న్‌కు రీమేక్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమా టైటిల్‌లో ఉన్న 8 అంకె పెద్ద చ‌ర్చ‌కు తెర‌లేపింది. టైటిల్ లోగో బ్యాక్ సైడ్ ఉన్న ‘8’ అంకె యొక్క రియల్ మీనింగ్ ఏంట‌న్న‌దానిపై ఎవ‌రికి వారు ర‌క‌ర‌కాలుగా లెక్క‌లు వేసుకుంటున్నారు.

దీనిపై ధృవ ప్ర‌మోష‌న్స్‌లో మీడియా మిత్రులు డైరెక్ట‌ర్ సురేంద‌ర్‌రెడ్డిని మీ కెరియ‌ర్లో 8వ సినిమా కావ‌డంతో ఈ సినిమా టైటిల్ లోగోలో 8 అంకె వ‌చ్చేలా పెట్టారా అని ప్ర‌శ్నించారు. దీనిపై కాస్త అస‌హ‌నం వ్య‌క్తం చేసిన సురేంద‌ర్‌రెడ్డి నేను నా ఇష్టం వ‌చ్చిన‌ట్టు అంకెలు పెట్టుకోవ‌డానికి చర‌ణ్ ఏమైనా చిన్న హీరోనా ?  ఈ సినిమా స్టోరీకి 8 అంకెకు ఓ ముఖ్య‌మైన లింక్ ఉంది కాబ‌ట్టే లోగోలో 8 అనే నెంబర్ ను పెట్టాం. సినిమా చూశాక ఆ కనక్షన్ ఏంటనేది మీకు అర్ధమవుతుంద‌ని చెప్పారు.

ఆ 8 నెంబ‌ర్ అన్న‌ది సినిమాలో ఒక సరి‌ప్రైజింగ్ ఎలిమెంట్ అట. తమిళంలో లేని ఆ సర్‌ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటన్నది సినిమా చూసే తెలుసుకోవాలని సురేందర్ రెడ్డి చెపుతున్నారు. చెర్రీ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో నాటి త‌రం హీరో అర‌వింద్ స్వామి విల‌న్‌గా న‌టిస్తుండ‌గా, క్రేజీ హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్ హీరోయిన్‌గా న‌టించారు. సో మ‌రి ధృవ టైటిల్ వెన‌క ఉన్న 8 నెంబ‌ర్ సీక్రెట్ ఏంట‌నేది తెలియాలంటే ఈ నెల 9 వ‌ర‌కు వెయిట్ చేయాల్సిందే.