డిజాస్టర్ హీరోయిన్‌తో ప‌వ‌న్‌

ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల‌ను పట్టాలెక్కించేశాడు. ప్ర‌స్తుతం డాలీ డైరెక్ష‌న్‌లో కాట‌మ‌రాయుడు సినిమాలో న‌టిస్తోన్న ప‌వ‌న్‌, ఈ సినిమా త‌ర్వాత కోలీవుడ్ డైరెక్ట‌ర్ నీశ‌న్‌, త‌ర్వాత మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ సినిమాల‌ను వ‌రుస‌పెట్టి చేయ‌నున్నాడు. 2019 ఎన్నిక‌ల‌కు ముందే ప‌వ‌న్ ఈ సినిమాల‌న్ని కంప్లీట్ చేసి ఎన్నిక‌ల‌కు రెడీ కానున్నాడు.

ప‌వ‌న్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చ‌ట్ల‌కు కొద‌వుండ‌దు. ఇప్పుడు ఏకంగా మూడు సినిమాలు ఉండ‌డంతో ప‌వ‌న్ సినిమా ముచ్చ‌ట్లు అన్నీ ఇన్నీ కావు. ఇక తాజాగా ప‌వ‌న్ సినిమా గురించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప‌వ‌న్‌-నీశ‌న్ కాంబోలో స్టార్ ప్రొడ్యుస‌ర్ ఏఎం.ర‌త్నం నిర్మించే సినిమాలో ఓ ప్లాప్ హీరోయిన్ ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది.

త‌మిళ సూప‌ర్ హిట్ చిత్రం వేదాళంకి రీమేక్‌గా తెర‌కెక్కే ఈ సినిమాలో ప‌వ‌న్ స‌ర‌స‌న సాయేషా సైగ‌ల్‌ని హీరోయిన్‌గా తీసుకొన్నార‌ని తెలుస్తోంది. అఖిల్ తొలి చిత్రం అఖిల్‌తో ఎంట్రీ ఇచ్చిన భామ సాయేషా. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.  సినిమా త‌ర్వాత స‌యేషా బాలీవుడ్‌లోకి వెళ్లి అక్క‌డ అజ‌య్‌దేవ‌గ‌న్ స‌ర‌స‌న శివాయ్ సినిమాలో న‌టించింది.

అఖిల్ ప్లాప్ అవ్వ‌డంతో తెలుగు జ‌నాలు స‌యేషా పేరును త‌ల‌చుకోవ‌డ‌మే మానేశారు. ఎట్ట‌కేల‌కు ఈ అమ్మ‌డికి ప‌వ‌న్ సినిమాలో ఆఫ‌ర్ దొరికింది. ప‌వ‌న్ స‌ర‌స‌న ఛాన్స్ రావ‌డంతో స‌యేషా ఆనందానికి అవ‌ధులే లేవ‌ట‌. మ‌రి అఖిల్‌కు డిజాస్ట‌ర్ సినిమా ఇచ్చిన స‌యేషా ప‌వ‌న్ సినిమాను ఏం చేస్తుందో చూడాలి.