అపోలో పై శశికళ సంచలన వ్యాఖ్యలు

తమిళ అమ్మ జయలలిత చనిపోయిన నాటినుంచి రోజుకొక సంచలనాత్మకమైన వార్తలు వస్తూనే వున్నాయి. అయితే చాలామంది జయలలిత మరణం పై అనేకరకమయిన అనుమానాలు వ్యక్తం చేస్తూనేవున్నారు.

ఈ విషయంపైనే మొన్న గౌతమి కేంద్రానికి సైతం లేఖ రాసారు. ఇప్పుడు తాజాగా అన్న డి ఎం కే రాజ్యసభ సభ్యురాలు అయిన శశికళా పుష్ప అమ్మ పై  5 సంవత్సరాలుగా విషప్రయోగం జరిగిందని వ్యాఖ్యానించారు.

జయలలిత తినే భోజనంలో ఏదో కలిపి 5 సంవత్సరాలుగా ఆమెకు పెట్టారని ఆమె తన అనుమానాన్ని వ్యక్తం చేసారు. అంతే కాకుండా జయలలితకు చికిత్సనందించిన అపోలో ఆస్పత్రి యాజమాన్యం ఈ విషయం ఎందుకు దాచారని సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎంతవరకు నిజమనేది కేంద్రమే తేల్చాలి.