బ‌డ్జెట్ రూ.23 కోట్లు..వ‌సూళ్లు రూ.100 కోట్లు

ఇటీవ‌ల సౌత్ ఇండియ‌న్ సినిమాలో సంచ‌ల‌న విజ‌యాల సార‌థిగా ముద్ర‌ప‌డ్డ మోహ‌న్‌ లాల్ తాజాగా మ‌రో ఘ‌న‌తకు ద‌గ్గ‌ర‌వుతున్నాడు. ఈ  లెజెండ‌రీ క‌థానాయకుడిగా న‌టించిన మలయాళీ సినిమా ‘పులి మురుగన్’ ఇప్పుడు వంద కోట్ల రూపాయల వసూళ్ల మార్కును రీచ్ అయ్యే అవ‌కావ‌ముంద‌ని సినీ ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ మార్కెట్ల‌తో పోలిస్తే చిన్న‌దిగా పేరుప‌డ్డ మాలీవుడ్‌లో ఈ స్థాయి విజ‌యం అంటే అది మోహ‌న్‌లాల్ కు మాత్ర‌మే సాధ్య‌మ‌ని చెప్పాలి.

ఇప్పటికే తొంబై కోట్ల రూపాయల వసూళ్లను సాధించిన ఈ సినిమా త్వ‌ర‌లోనే వంద కోట్ల కు రీచ్ కానుందని  ట్రేడ్ పండితులు అంటున్నారు.  అస‌లు విశేషమేమిటంటే ఈ సినిమాను కేవలం 23కోట్ల బడ్జెట్ తోనే రూపొందించారు. వంద‌కోట్ల క్ల‌బ్‌లో చేరుతున్న సినిమాలు ఇత‌ర భాష‌ల్లో ఉంటే ఉండ‌వ‌చ్చునేమో కాని.., ఇలా పాతిక కోట్లకు లోపు వ్య‌యంతో రూపొందించిన సినిమా అంత‌కు నాలుగు రెట్ల వసూళ్లను సాధించ‌డం మాత్రం దాదాపు అసాధ్య‌మేన‌ని చెప్పాలి. మ‌రి.. వ‌రుస విజ‌యాల మోహ‌న్‌లాల్‌కి అంతా కంగ్రాట్స్ చెప్పాల్సిందే…