ఎన్టీఆర్ పార్టీతో ఎఫెక్ట్ ఎవ‌రికి ..!

జూనియ‌ర్ ఎన్టీఆర్‌! త‌న వినూత్న న‌ట‌న‌తో సీనియ‌ర్ ఎన్టీఆర్‌ని మ‌రిపించి.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను మురిపించిన డైన‌మిక్ హీరో! వెండి తెర‌పై ఈయ‌న వేసే స్టెప్పులు చాలా మ‌టుకు సీనియ‌ర్ ఎన్టీఆర్‌నే గుర్తుకు తెస్తాయి. ఈ కార‌ణంగానే అత్యంత త్వ‌ర‌గానే తెలుగు ఆడియ‌న్స్‌కి చేరువ అయిపోయాడు జూనియ‌ర్‌. దీంతో ఈయ‌న చ‌రిష్మాను త‌న పాలిటిక్స్‌కి మిక్స్ చేసి.. అధికారంలోకి వ‌చ్చేందుకు 2009లో టీడీపీ అధినేత చంద్ర‌బాబు తీవ్రంగా య‌త్నించారు. తాత పెట్టిన పార్టీ కావ‌డంతో టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసి పెట్టేందుకు జూనియ‌ర్ రెడీ అయిపోయి.. అచ్చు తాత‌లాగే.. ఖాకీ దుస్తుల్లో .. అన్న‌గారి శైలిలో డైలాగ్ డెలివ‌రీ చేస్తూ.. పొలిటిక‌ల్ ప్ర‌చారం చేసి పెట్టారు.

అయితే, అనూహ్య కార‌ణాల నేప‌థ్యంలో ఎన్‌టీఆర్ ఎంత ప్ర‌చారం చేసిన అప్ప‌ట్లో టీడీపీ అధికారంలోకి రాలేక‌పోయింది. ఇదిలావుంటే, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఏపీలో మూడు ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య జోరు ముమ్మ‌రంగా ఉంది. ఇప్పుడు ఈ నేప‌థ్యంలోనే జూనియ‌ర్ కూడా పార్టీ పెట్ట‌బోతున్నార‌నే టాక్ వినిపిస్తోంది. వాస్త‌వానికి తాను టీడీపీకే విధేయుడిన‌ని చాలా సార్లు ఎన్‌టీఆర్ చాటుకున్నారు. తాను వేరు, టీడీపీ వేరు కాద‌ని కూడా చెప్పారు. అయితే, మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్య‌లో త‌న మ‌న‌సు మార్చుకున్నాడ‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఆయ‌న పార్టీ పెట్టాల‌ని యోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ క్ర‌మంలో నిజంగానే ఎన్‌టీఆర్ పార్టీ పెడితే స‌హ‌జంగానే ఎవ‌రికి న‌ష్టం అనే మాట ఉత్ప‌న్న‌మ‌వుతుంది. ఈ కోణంలో చూసిన‌ప్పుడు వైకాపా అధినేత జ‌గ‌న్‌కి ఎలాంటి ఇబ్బందీ ఉండే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే.. గ‌తంలోనూ ఇప్పుడూ ఓన్లీ వ‌న్‌గా ఆయ‌న పార్టీని న‌డిస్తున్నారు. ఆయ‌న‌కున్న సింప‌తీ కావొచ్చు, మాట తీరు కావొచ్చు.. ఆయ‌న‌కు ఓట్లు ప‌డేలా చేస్తుంది. ఇక‌, ప‌వ‌న్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఈయ‌న‌కు మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. ఎన్‌టీఆర్‌కి మూవీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది.

కాబ‌ట్టి ఇరువురూ పోటాపోటీగా నిల‌బ‌డాల్సి ఉంటుంది. ఇక‌, ఎటొచ్చీ..టీడీపీకే జూనియ‌ర్ వ‌ల్ల ఎస‌రొస్తుంద‌ని టాక్‌. గ‌తంలో ఈయ‌న టీడీపీకి ప్ర‌చారం చేసి పెట్టారు కాబ‌ట్టి.. పార్టీపై ఆయ‌న‌కు ప‌ట్టుంది. సో.. జూనియ‌ర్ పార్టీ పెడితే.. టీడీపీ నుంచి వ‌ల‌స‌లు ప్రారంభం కావ‌డంతోపాటు.. కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆ పార్టీ ఓటు బ్యాంకుకు భారీగా గండిప‌డే ప్ర‌మాదం ఉంది. ఈ నేప‌థ్యంలో జూనియ‌ర్ పార్టీతో టీడీపీకే ఎఫెక్ట్ క‌నిపిస్తోంది. మ‌రి అస‌లు జూనియ‌ర్ పార్టీ పెడ‌తాడా?  లేదా? అన్న‌ది తేలితే.. దీనిపై మ‌రింత క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది.