శృతి చెప్పిన శృంగార పాఠం

సౌత్ ఇండియా లో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగు తోంది శృతి హాసన్.కమల్ హాసన్ కూతురిగా వెండితెరకు పరిచయమైన శృతి తండ్రి నీడనుండి అనతి కాలం లోనే బయటికొచ్చి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.ఇటు అందం అటు అభినయం తో కెరీర్ లో దూసుకుపోతోంది.

అయితే ఈ మధ్య సినిమాల్లో పెరుగుతున్న మితిమీరిన శృంగారం పై శృతి సరికొత్త శృంగార నిర్వచనం చెప్పారు.అప్పుడెప్పుడో విడుదలైన మహేష్ బాబు పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ ఓ డైలాగు చెబుతాడు..ఓ కోడిని కోస్తామ్..ఓ మనిషి పీక కోస్తాం ..నాకు రెండూ ఒకటే అని.అచ్చం శృతి కూడా శృంగార దృశ్యాలపై ఇలాగ స్పందించింది.

ఒక సినిమా ఒప్పుకున్నామంటే అందులో కామెడీ,డాన్స్,ఎమోషన్స్ తో పాటు శృంగార దృశ్యాల్లో కూడా నటించాల్సి ఉంటుంది.ఒక హాస్య సన్నివేశం లో ఎలా నటిస్తామో రొమాన్స్ సీన్ లో కూడా అలాగే చేస్తానంటోంది శృతి.చేయక తప్పదనుకున్నప్పుడు ఇక దేని గురించి ఆలోచించనని అన్నింటినీ సమదృష్టితో చేస్తానంటోంది శృతి.ఎంతైనా శృతి శృంగార పాఠం అదుర్స్ కదూ..