రాజమౌళి కట్టప్ప సీక్రెట్‌ రివీల్‌ చేస్తాడా? 

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన డైరెక్టర్‌ రాజమౌళి. ఇప్పుడు ప్రపంచం మొత్తం చర్చించుకుంటోన్న విషయం ‘బాహుబలి’ సినిమాలో కట్టప్ప, బాహుబలిని ఎందుకు చంపాడు? అని. గత ఏడాదిగా ఈ సస్పెన్స్‌ను ఎవరు రివీల్‌ చేస్తారా? అంటూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సెకండ్‌ పార్ట్‌కి సంబంధించి ఏ విషయాలు ఇంతవరకూ బయటికి పొక్కలేదు. అంత గోప్యంగా రాజమౌళి సినిమా టీంను కంట్రోల్‌లో పెట్టాడు. ఆ విషయంలో నిజంగా రాజమౌళికి రాజమౌళే సాటి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయనే విషయం మాత్రం బయటికి వచ్చింది.

అందులో భాగంగా బాహుబలి టీం మీడియా ముందుకు రానుంది. ఈ మీడియా సమావేశంలో రాజమౌళి సమక్షంలోనే ఈ సినిమాకి సంబంధించిన వివరాలు బయటికి రానున్నాయని భావిస్తున్నారు. సినిమా ట్రైలర్‌, రిలీజ్‌ డేట్స్‌ వివరాలు తెలియనున్నాయన్న మాట. సినిమా నిర్మాణ కార్యక్రమాలు పూర్తయ్యాయి కానీ, విజవల్‌ ఎఫెక్ట్స్‌ పెండింగ్‌ ఉన్నాయి. ‘బాహుబలి’ మొదటి పార్ట్‌లోని విజువల్‌ ఎఫెక్ట్స్‌ని మించి, రిచ్‌గా ఈ పార్ట్‌లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉండబోతున్నాయట. అనుష్క, తమన్నాలు ఈ పార్ట్‌లో తమ అందచందాలతో పాటు, గుర్రపు స్వారీలు, కత్తి యుద్ధాలు చేయనున్నారట.