రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్‌ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్‌ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ సినిమాలు రామ్‌ చరణ్‌తో ‘ధృవ’, మహేష్‌బాబుతో మురుగదాస్‌ సినిమా ఉన్నాయి. ఈ రెండూ భారీ అంచనాలున్న సినిమాలే. వీటిలో రాంచరణ్‌ ‘ధృవ’ ఈ ఏడాది దసరాకి ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ సినిమాతో రకుల్‌కి సక్సెస్‌ గ్యారంటీ అంటున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు.

తొలి సినిమా రాంచరణ్‌తో ‘బ్రూస్‌లీ’ అనుకున్నంత విజయాన్ని అందుకోలేకపోయింది. మళ్లీ బ్యాక్‌ టు బ్యాక్‌ చెర్రీతోనే జతకట్టే బంపర్‌ ఛాన్స్‌ దక్కించేసుకుంది ఈ ముద్దుగుమ్మ. దటీజ్‌ రకుల్‌. అయితే మహేష్‌, మురుగదాస్‌తో చేయబోయే సినిమాలో రకుల్‌ పాత్రకు ప్రాధాన్యత ఎక్కువంట. అదీ గాక ఈ సినిమాలో రకుల్‌ పోలీస్‌ గెటప్‌లో కూడా నటించనుందని సమాచారమ్‌. ఇంకేముంది, పోలీస్‌ డ్రస్‌లో రకుల్‌ ఆవారాగాళ్ళను ఇరగదీసేస్తుందేమో! అందులోనూ మహేష్‌తో నటించడమనేది రకుల్‌ డ్రీమ్‌ కూడా. ఇన్ని స్పెషాలిటీస్‌తో ఈ సినిమాలో నటిస్తోన్న ఈ స్మైలీ బ్యూటీ రకుల్‌కి సూపర్‌ స్టార్‌ సూపర్‌ సక్సెస్‌ ఇస్తాడా? లేక మెగా పవర్‌ స్టార్‌ మెగా సక్సెస్‌ ఇస్తాడో చూడాలి.