కూతురి కోసమేనా ఈ త్యాగం! 

అందాల భామ ఐశ్వర్యారాయ్‌, కుమార్తె ఆరాధ్యకు జన్మనిచ్చాక కొంతకాలం సినిమాలకు విరామం ఇచ్చింది. ఈ మధ్యన సినిమాల్లో నటించేందుకు ముందుకు వచ్చి, ఒకటి రెండు సినిమాల్లో నటించినా, సినిమాలు వేగంగా చెయ్యలేకపోతోంది ఇదివరకటిలా. ఆమె అందానికి ఫిదా అయ్యే ప్రేక్షకులు ఇప్పటికీ ఒకప్పటిలానే ఉన్నారు. దాంతో, ఆమెకు అవకాశాలైతే బోలెడు ఉన్నాయి. కానీ వాటిని అంగీకరించలేకపోతోంది ఐశ్వర్యారాయ్‌. ఒకవేళ నటించినా, ఆ సినిమాల ప్రమోషన్‌కి కూడా సరిగ్గా వెళ్ళలేకపోతోంది. కారణం ఆమె కుమార్తె ఆరాధ్య అట. తనకు తన కుమార్తె తర్వాతే సినిమా కెరీర్‌ అంటోంది ఐశ్వర్యారాయ్‌.

ఆమె మాటల్లోనూ నిజం లేకపోలేదు. అయితే ఆమెతో సినిమాలు చేసినవారు, ఐష్‌ సినిమా ప్రమోషన్‌కి రాకపోవడంతో అసహనం వ్యక్తం చేస్తున్నారట. సినిమా ప్రమోషన్‌కి సహకరించపోతే కష్టం కదా అని వాపోతున్నారట. ఐష్‌ వెర్షన్‌ ఇంకోలా ఉంది ప్రమోషన్‌కి సంబంధించి నిర్మాతలు చేస్తున్న ఆరోపణలపై. సినిమా ఒప్పుకునేటప్పుడే ఆరాద్య విషయం వారికి చెబుతున్నాని అంటోంది. ఈ వివాదాలు ఏ నిర్మాతకైనా కష్టమే కదా! ఐశ్వర్యారాయ్‌ నటించిన ‘ఏ దిల్‌ హై పాగల్‌’ సినిమా ఇటీవలే విడుదలయ్యింది. ఈ సినిమా ప్రమోషన్‌కి సరిగ్గా వెళ్ళకపోవడంతోనేనట వివాదం తెరపైకి వచ్చింది.